Heart Attacks: ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో వయసు పైబడినవారికి వచ్చే ఓ జబ్బుగా గుండెపోటు ఉండేది. కానీ ఇప్పుడు యువతలో ముఖ్యంగా టీనేజ్ లో కూడా గుండెపోటు రావడం తద్వారా మరణాలు సంభవించడం చోటు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే గుండెపోటుపై ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఓ అధ్యయాన్ని నిర్వహించింది. ఇది టాప్ మెడకల్ జర్నల్ అయిన ది లాన్సెట్ లో ప్రచురించబడింది.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని రాష్ర్టాలకు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను మంజూరు చేశాయి. అందులో భాగంగా చాలా రాష్ట్రాల్లో ఎయిమ్స్ నిర్మాణాలను పూర్తి చేయలేదు.
కుక్కలు అంటూనే బాబోయ్ అంటున్నారు ప్రజలు. కుక్కలను చూడగానే ఆమడదూరంలో పరుగెడుతున్నారు. వీధిల్లో తిరగాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఇక.. దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్క కాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
Cancer Cases: దేశంలో రానున్న కాలంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ అంచనా వేస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అందించిన డేటా ఆధారంగా ఎయిమ్స్ ఈ అంచనాను రూపొందించింది. 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్‌విఎస్ డియో అన్నారు.
Covid Infection May Impact Semen Quality In Men: కోవిడ్-19 ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. మూడేళ్లు గడిచినా.. రూపాలను మార్చుకుంటూ మనుషులపై అటాక్ చేస్తోంది. ఇదిలా ఉంటే కోవిడ్ వచ్చి కోలుకున్నప్పటికీ దీర్ఘకాలికంగా దాని ప్రభావానికి గురువుతోంది శరీరం. వ్యాధి తగ్గిపోయినా శ్వాసకోశ ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలతో సతమతం అవుతున్నారు. తాజాగా అధ్యయనం మరో షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. సార్స్ కోవో-2 వైరస్ సంక్రమించిన తర్వాత వీర్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు ఆల్ ఇండియా…
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్లపై సైబర్ దాడికి పాల్పడింది చైనా హ్యాకర్లేనని ప్రభుత్వ వర్గాలు ఈ రోజు తెలిపాయి. ప్రస్తుతం అందులోని డేటాను రిట్రీవ్ చేసినట్లు తెలిపాయి. ఈ సైబర్ దాడి చైనా హ్యాకర్ల పనే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
Hacking : ఢిల్లీ ప్రతిష్టాత్మక సంస్థ ఎయిమ్స్ సర్వర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాకర్లు రూ.200 కోట్లు డబ్బులను క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.