Dog attacks: కుక్కలు అంటూనే బాబోయ్ అంటున్నారు ప్రజలు. కుక్కలను చూడగానే ఆమడదూరంలో పరుగెడుతున్నారు. వీధిల్లో తిరగాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఇక.. దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్క కాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఫలితంగా అరగంటలోనే మరణం సంభవించినట్లు గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ , ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించింది.
అయితే.. ప్రపంచంలో కుక్కల సంఖ్య 100 కోట్లు కాగా.. వివిధ దేశాల్లో వీధికుక్కల సంఖ్య 70 కోట్లు ఉంది. ప్రపంచంలో వీధికుక్కలు లేని మొదటి దేశం నెదర్లాండ్స్ మాత్రమే కావడం గమనార్హం. అక్కడ వీధి కుక్కలు అనే మాటే కాదు కదా అస్సలు కనిపించవు. అయితే, 2030 నాటికి రేబిస్ మరణాలను పూర్తిగా నియంత్రించాలన్నది భారత్‌తో సహా ప్రపంచ దేశాలు విధించిన గడువు. AIIMS అధ్యయనం ప్రకారం, కుక్కకాటు మరియు ఇతర జంతువుల కాటు వల్ల వచ్చే రేబిస్ కారణంగా ప్రతి సంవత్సరం 18,000 నుండి 20,000 మంది మరణిస్తున్నారని ICMR వెల్లడించింది. దేశంలో 93% రేబిస్ మరణాలు కుక్క కాటు వల్లనే సంభవిస్తున్నాయనేది వెలుగులోకి వచ్చింది. ఇందులో 63% వీధి కుక్కల వల్ల వస్తుంది. పట్టణాల్లో 60%, గ్రామాల్లో 64% వీధికుక్కల ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే.. భారత్‌లో 2 కోట్ల కుక్కలు ఉండగా అందులో వీధికుక్కల సంఖ్య 1.53 కోట్లు ఉంది. ICMR అధ్యయనం ప్రకారం, వీధి కుక్కల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోవడమే. అందుకే చెత్తకుప్పల దగ్గర వీధికుక్కలు ఎక్కువవుతున్నాయి. అయితే దేశంలోని చాలా ఆసుపత్రులు కుక్కలకు ఆశ్రయం కల్పిస్తున్నాయి.
Read also: Amul vs Nandini: కర్ణాటకలో “పాల వివాదం”..నందిని మిల్క్‌కు సపోర్టుగా బెంగళూర్ హోటల్స్..
ఆసుపత్రులు వద్ద రోగులు పడేసే ఆహార వ్యర్థాలను తింటూ అక్కడే తిష్ట వేస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చే ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. తిండి దొరక్క ప్రభుత్వాస్పత్రుల్లో నిర్వహణ సరిగ్గాలేని మార్చురీల్లోకి చొరబడి శవాలను సైతం పీక్కుతింటున్నాయి. అయినప్పటికీ, మనుషుల మీద ఆధారపడే దాన్ని బట్టి కుక్కలను పెంపుడు కుక్కలు, సామాజిక కుక్కలు మరియు వీధి కుక్కలుగా విభజించారు. అయితే ప్రధానంగా వీధికుక్కల వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుక్కల సంతతిని నియంత్రించేందుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సరైన ప్రణాళికలు రూపొందించకపోవడం, జంతు హక్కుల కార్యకర్తల కార్యకలాపాల వల్ల కుక్కకాటు పెరిగిపోతోంది. అయితే కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఒకేసారి కుక్కలకు కుటుంబ నియంత్రణ చేయడం కష్టతరమైనందున, నోటి ద్వారా వచ్చే వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసి కుక్కలకు తినిపించాలి. ఇది వారి జాతులను వీలైనంత వరకు పరిమితం చేయవచ్చు. మున్సిపాలిటీ, వెటర్నరీ, స్వచ్ఛంద సంస్థలు, కుక్కల రక్షణ కేంద్రాలు, ప్రజలు సమన్వయంతో పని చేయాలి. వీధికుక్కల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆపరేషన్లకు బదులుగా టీకాలు, ఇతర అధునాతన కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబిస్తే మెరుగైన ఫలితాలు లభిస్తాయని దీని ద్వారా వీధికుక్కలను నియంత్రణ చేయవచ్చని AIIMS, ICMR అధ్యయనాలు చెబుతున్నాయి.
Mahabubnagar Crime: కల్తీకల్లు వ్యవహారంలో వెలుగులోకి సంచలన విషయాలు