మాజీ సీఎం నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్‌గా మారారు. వాయల్పాడు, పీలేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2004-2014లోపల చీఫ్‌విప్, స్పీకర్, ఉమ్మడి ఏపీకి చిట్టచివరి సీఎంగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి దెబ్బతిన్నాక అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిర్వహించిన సభకు మాత్రమే…
రాజస్థాన్ ఉదయపూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఐదుళ్లు పార్టీ పదవుల్లో ఉన్నవారిని పక్కన పెట్టడం.. అదే పదవిలో కొనసాగించడం సాధ్యం కాదని తేల్చేయడం.. కొత్త పదవులు ఇస్తారో లేదో స్పష్టత లేకపోవడం.. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ కలకలం రేపుతోంది. తెలంగాణ నుంచి ఏఐసీసీ కార్యదర్శులుగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీ, మాజీ ఎంపీ మధుయాష్కీకొనసాగుతున్నారు. ఇప్పుడు వీళ్ల పరిస్థితి ఏంటి అన్నది పెద్ద ప్రశ్న.…
తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ నిర్మాణంపై చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన తర్వత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపడతారు. ఇప్పటికే పీసీసీ కొంత కసరత్తు చేసిందని ప్రచారం నడుస్తోంది. రాహుల్ టూర్ ఉండటంతో ఆ కసరత్తుకు బ్రేక్ పడింది. కాకపోతే కమిటీపై మెలిక పంచాయితీ మాత్రం గ్రేటర్ మీద పడింది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలంగానే ఉన్నా.. పాతికకు పైగా సెగ్మెంట్లు ఉన్నా నాయకత్వం అంతంత మాత్రమే. ప్రస్తుతం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పార్టీకి నాయకత్వం…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీగా ముద్ర ఉంది. కాంగ్రెస్‌లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువే..! కానీ.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా సామాజిక ఈక్వేషన్ దెబ్బతింటుందనే చర్చ జరుగుతోంది. ఈ విషయం గమనించకుండా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలు ఉంటున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సామాజిక తెలంగాణ అని చెబుతున్న కాంగ్రెస్‌లోనే ఆ సమీకరణాల లెక్క తప్పడంతో కొత్త చర్చ మొదలైంది. పార్టీ నేతల నుంచే పెదవి విరుపు వస్తోందట. నెల రోజుల వ్యవధిలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులతో బేజారైపోతున్న కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేసేందుకు ఆపార్టీ అధినేత్రి సోనియాగాంధీ సిద్దమయ్యారు. ఢిల్లీలో కీలక భేటీని ఏర్పాటు చేశారు. ఏఐసీపీ ప్రధాన కార్యాలయంలో సోనియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు అటెండ్ అవుతారు. పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చిస్తారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై నేతల నుంచి వివరాలను తీసుకోనున్నారు సోనియా. పార్టీలో…
ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.. ఇదే సమయంలో.. ప్రక్షాళన ప్రారంభించారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ… ఈ పరిణమాలపై ఢిల్లీలో స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. సోనియా గాంధీ ప్రక్షాళన ప్రారంభించారు.. ఆమెకు నా అభినందనలు.. ఇది శుభసూచకం అన్నారు.. రేపు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సోనియా సమావేశం అవుతున్నారు… తెలంగాణలోని పరిణామాలను కూడా సోనియా గాంధీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించిన…
జీ-23 కాంగ్రెస్ అసమ్మతి నేతల వరుస భేటీలు దేశ రాజకీయాల్లో కాకరేపాయి. రెబల్స్ నేతల సమావేశాలపై హాట్‌హాట్‌గా చర్చలు, విశ్లేషణలు సాగాయి. అయితే వరుస భేటీలతో హీట్ పెంచిన సీనియర్లు మొత్తానికి చల్లబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ భేటీ అయ్యారు. 10 జనపథ్‌లోని ఆమె నివాసంలో సమావేశమై గంటకు పైగా పలు కీలక అంశాలపై చర్చించారు. సోనియాతో ముఖ్యంగా ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆజాద్…
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయిందని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.. మరి మిగతా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఇది 40లక్షల కుటుంబాల సమస్య. తెలంగాణ లో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించండి. 90 వేల ఉద్యోగాలు ఇచ్చి 39లక్షల మంది నోట్లో మట్టి కొడుతున్నారు. నిరుద్యోగం పై లోతైన చర్చ జరగాలి…అఖిలపక్షంతో చర్చించాలన్నారు. నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు…
అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది. వరుస పరాజయాల నేపథ్యంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీని తిరిగి పట్టాలెక్కించడం సాధ్యమా? గులామ్ నబీ ఆజాద్ నివాసంలో కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి నేతల సమావేశం హాట్ టాపిక్ అవుతోంది. గులాం నబీ అజాద్ నివాసంలో సమావేశానికి హాజరుకానున్నారుమనీష్ తివారి, భూపేందర్ సింగ్ హుడా, పృధ్విరాజ్ చౌహాన్, ఆనంద శర్మ వంటి నేతలు. జి-23 అసమ్మతి బృందంలో కాంగ్రెస్ పార్టీని వీడిన జితిన్ ప్రసాద్, యోగానంద శాస్త్రి కూడా హాజరవుతారు. ఇటీవల…
పోయినవాళ్లు పోగా.. ఉన్నవారిలో ఆయన ఒక్కరే స్వపక్షంలో విపక్షం అనుకున్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేదీ అదేదారి. ఒకరికి ఇద్దరయ్యారు. సేమ్ టు సేమ్. వారి గురించే పార్టీలో ప్రస్తుతం చర్చ. వారెవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్‌లోనే ఉంటాననే నమ్మకం కలిగించడం లేదు..!తెలంగాణ కాంగ్రెస్ తీరు మారదా? మంచిరోజులు కనుచూపు మేరలో లేవా? పార్టీలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? హస్తం అస్తవ్యస్తమవుతున్నా పట్టించుకోరా? గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివి. కొన్నిరోజులు ఒకరు.. మరికొన్ని రోజులు…