కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి శుక్రవారం ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
కాంగ్రెస్ నాయకత్వాన్ని కుదిపేసిన జీ-23లో ఒకరైన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్... పార్టీలో సంస్కరణల గురించి ఇటీవల ప్రస్తావించారు. వచ్చే నెల జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు శశి థరూర్ సుముఖంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ నేడు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ మెంబర్లు, జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.
రికార్డు స్థాయిలో పెరిగిన ధరల పెరుగుదల, నిరుద్యోగంపై దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు ఆందోళలనకు కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు తమకు గుర్తింపు లేదని తరచూ నిరసన గళం ఎత్తుతారు. ఒకవేళ గుర్తించి పదవులు ఇస్తే మరోలా స్పందిస్తారు. పార్టీలో కీలక పదవులన్నీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకే ఇచ్చారని.. ఇతర జిల్లాల వారిని పక్కన పెట్టారని గాంధీభవన్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్.. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ.. కోశాధికారి సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. వీళ్లంతా నిజామాబాద్ జిల్లా నాయకులే. మహేష్‌గౌడ్ పూర్తిస్థాయిలో పార్టీ పనిలో ఉంటే..…
తెలంగాణ మహిళా కాంగ్రెస్‌లో గొడవలు చినికి చినికి గాలి వానాలా మారిపోయాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తీరే వివాదాలకు కారణమన్నది కొందరి వాదన. ప్రశ్నించినా.. చెప్పిన పని చేయకపోయినా వారిని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నారట. ఇటీవల మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగితే… ఓ రేంజ్‌లో రసాభాస అయ్యింది. దుర్భాషలాడారనే అభియోగాలతో మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు పదవి నుంచి కవితామహేష్‌ను తప్పించారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నది గాంధీభవన్ వర్గాల టాక్. మహిళా…
AICC ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి చింతన్ శిబిర్ తర్వాత.. తెలంగాణలోనూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలను ఘనంగా ముగించారు రాష్ట్ర పార్టీ నాయకులు. కాకపోతే ఈ చింతన్ శిబిర్తో పార్టీ ఏం చెప్పాలని అనుకుంది? ఏం చెప్పింది అనేది పార్టీ కేడర్‌కు కూడా అంతుచిక్కడం లేదట. ఆ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులంతా ఓపెన్ అయ్యారు. వాటిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటన్నదే స్పష్టత కరువైనట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. అమలు చేయాల్సిన నిర్ణయాలేంటో కూడా శ్రేణులకు అర్ధం కాలేదని…
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి. ఇద్దరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. వేర్వేరు వర్గాలు. తూర్పు.. పడమర ప్రాంతాలకు చెందిన నాయకులు. మహేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇన్నాళ్లూ అంతర్గత కలహాలతో ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరూ.. ప్రస్తుతం యుగళగీతం ఆలపించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అధిష్ఠానం ఒత్తిడో ఏమో ఇద్దరూ ఒకే లైన్లోకి వచ్చారు. ఇలాంటి సమయంలో ప్రేమ్ సాగర్‌రావు చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.…