తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయిందని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.. మరి మిగతా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఇది 40లక్షల కుటుంబాల సమస్య. తెలంగాణ లో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించండి. 90 వేల ఉద్యోగాలు ఇచ్చి 39లక్షల మంది నోట్లో మట్టి కొడుతున్నారు.
నిరుద్యోగం పై లోతైన చర్చ జరగాలి…అఖిలపక్షంతో చర్చించాలన్నారు. నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ భృతిని ఎవరు అడ్డుకుంటున్నారు..ఎందుకు అమలు చేయట్లేదో చెప్పాలన్నారు. ప్రైవేటు రంగంలో 95శాతం ఉద్యోగాలు తెలంగాణ వాళ్శకే ఇస్తే..నేను కూడా కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానన్నారు. యువత లో స్కిల్ డెవలప్ మెంట్ బాధ్యత ప్రభుత్వం పై ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లు పెట్టాలి. ఫీల్డ్ అసిస్టెంట్ లను రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. 70 మంది ఫీల్డ్ అసిస్టెంట్ లు చనిపోయారు. వివిధ శాఖల లో తొలగించిన మిగతా 42వేల మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.
చనిపోయిన ఫిల్డ్ అసిస్టెంట్ ల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ ల అందరికీ రెండు సంవత్సరాల జీతం ఇవ్వాలి. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోసం వివిధ శాఖలకు దరఖాస్తు చేసిన అప్లికేషన్ లను క్లియర్ చేయాలి. నా దగ్గర ఉన్న సమాచారం తో సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తానన్నారు శ్రవణ్. చదువుకున్న ప్రతి నిరుద్యోగి అన్ని పరిక్షలు రాసేలా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలన్నారు దాసోజు శ్రవణ్.