కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అంటే..బస్సుకు డ్రైవర్ లాంటి వాడే అన్నారు. బస్సు చక్కగా లేకుంటే.. సరిద్దిద్దు కో అని చెప్పిన. ఇది కూడా చెప్పొద్దా..? కెసిఆర్ నా కంటే పెద్ద.. తిట్టను.. నా కంటూ ఓ పద్ధతి ఉంటుందన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ ఉద్యమం సమయంలో కెసిఆర్ నీ సంగారెడ్డి కి ఎట్లా వస్తవో రా..? అని ఎదురు నిలబడ్డా. నా కంటే ఎక్కువ కొట్లాట చేసిర్ర ఎవరన్నా..? నా మీద చెయ్…
ఏపీలో కాంగ్రెస్ పార్టీని సమర్ధంగా నడిపించే నాథుడెవరు? కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చిందా? కాంగ్రెస్ ఆలోచనేంటి? రేసులో ముందున్నది ఎవరు? ఈ ప్రశ్నల్నిటికి సమాధానం రాబోతోంది. ఏపీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు నియామకం కొలిక్కి వచ్చింది. ఫ్రంట్ రన్నర్ గా మాజీ ఎంపీ డా.చింతామోహన్ వున్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలపై నివేదిక ను సిధ్దం చేయనున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాందీ. సమర్ధుడు, విధేయుడు, సమన్వయంతో…
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హస్తిన పర్యటన వాయిదా పడింది.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో జరగాల్సిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ రద్దు అయ్యింది. మరోవైపు రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్.. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుచరులతో సమావేశమై చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నారు. మొత్తంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత తిరిగి కాంగ్రెస్…
2014 నుంచి కునారిల్లుతున్న ఏపీ కాంగ్రెస్‌పై అధిష్టానం ఫోకస్ పెట్టిందా? త్వరలో సారథి మారనున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టు నాగంబొట్టు తరహాగా మారింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభలోనూ జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తీరా స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా హస్తవాసి బాగుంటుందా అంటే అలాంటిదేం లేదు. ఏయేటికాయేడు పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. అసలు పార్టీ వుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం…
వివిధ పార్టీల్లో మెంబర్ షిప్‌లు చాలా ఈజీగా లభిస్తాయి. మన పేరు చెప్పి వందో, రెండువందలో కడితే మెంబర్ షిప్, దానికి అదనంగా బీమా సదుపాయం కూడా లభిస్తుంది. అయితే, దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పురాతన పార్టీ కాంగ్రెస్‌లో మెంబర్ షిప్ తీసుకోవడం అంత ఈజీగా కాదు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం కొత్త నిబంధనలను పార్టీ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మాలను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి…
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది.. 2022 సెప్టెంబర్ నెలలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది.. నవంబర్ 1వ తేదీ నుంచి సత్యభత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమై 2022 ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగనుంది.. అయితే, ఈ సమావేశంలో తిరిగి ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించాలని రాహుల్ గాంధీని కోరారు.. మరోవైపు.. తాను కాంగ్రెస్‌కు తాత్కాలిక అధ్యక్షురాలిగా లేనని.. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే…
తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు, కొత్త కమిటీల నియామకం తర్వాత తొలిసారి హస్తినబాట పట్టారు నేతలు.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన టి. కాంగ్రెస్ నేతలు.. రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు హాజరయ్యారు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యాచరణపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఈ…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్ గాంధీ దృష్టిసారించారు.. రాహుల్‌తో సమావేశమైన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి.. బలోపేతానాకి తీసుకోవాల్సిన చర్చలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం.. రాష్ట్రానికి చెందిన పలు సీనియర్లకు జాతీయస్థాయులో పార్టీలో బాధ్యతలు అప్పచెప్పాలన్న ఆలోచనలో రాహుల్ ఉన్నారని చెబుతున్నారు.. ఏపీలో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను మళ్లీ కదిలించేందుకు..…
ఆడియో టేపు లీక్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుజురాబాద్ నేత కౌశిక్‌రెడ్డికి మరో షాక్ తగిలింది… టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించేందుకు రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేయడంపై సీరియస్‌గా స్పందించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్… పాడి కౌశిక్‌రెడ్డికి లీగల్‌నోటీసులు పంపారు.. కౌశిక్‌కు మదురై కోర్టు నుంచి ఈ లీగల్‌నోటీసు జారీ అయ్యాయి… దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొనగా… లేకపోతే…