కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ‘నా ఇంటికి రా.. ఇది నీ ఇల్లు భయ్యా’ అంటూ రాహుల్ గాంధీని ఢిల్లీలోని తన ఇంటికి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ‘నా ఇల్లు మీ ఇల్లు... మిమ్మల్ని నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను.. మనది ఒకే కుటుంబం.. ఇది మీ ఇల్లు’ అంటూ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సందేశం పంపారు.
Congress plenary : దేశంలో ద్వేషపూరిత నేరాల ముప్పును పరిష్కరించడానికి, చట్టాన్ని ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరుగుతోంది.
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికి ఎందుకు పదవులు వస్తాయి అనేది పార్టీ శ్రేణులకు, లీడర్స్‌కు అంతుచిక్కడం లేదు. పార్టీ కోసం పని చేసిన వారికి.. పదవులు ఇంటికి నడుచుకుంటూ వస్తాయని… ఇటీవలే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ ఇటీవల పార్టీలో భర్తీ అయిన పదవుల్లో ఈ ఫార్మలా వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. తాజాగా ఏఐసీసీ సభ్యుల నియామకంలో జరిగిన పరిణామాలను చూస్తే అది అర్థం అవుతోంది. ఏఐసీసీ సభ్యుల…
Off The Record:పార్టీ ప్లీనరీకి సిద్ధమవుతుంది కాంగ్రెస్. ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే సమావేశాలు పార్టీకి కీలకం. ఈ ప్లీనరీ కోసం అధిష్ఠానం కీలక కమిటీలను వేసింది. ఆ కమిటీల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం దక్కింది. కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డిని ఓ కమిటీకి చైర్మన్‌గా ప్రకటించింది. వీరితోపాటు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రి జేడీశీలం లాంటి నాయకులకు కమిటీలలో…
తెలంగాణ కాంగ్రెస్‌లో పంచాయతీపై అధిష్ఠానం సీరియస్‌గానే నజర్ పెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను పరిశీలకుడిగా పంపిస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్‌కు రాబోతున్నారు. అధిష్ఠానం జోక్యంతో సీనియర్ నేతల సమావేశం వాయిదా పడింది.
కొత్త కమిటీల కోసం కళ్లల్లో వత్తులు వేసుకొనిమరీ ఎదురు చూస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అదిగో ఇదిగో అని తేదీలు వాయిదా పడుతున్నాయి తప్ప.. ఢిల్లీ నుంచి కబురే లేదు. ఇంతలో బయటకు వస్తున్న లీకులు.. జరుగుతున్న చర్చలు.. అసంతృప్తిని రాజేస్తున్నాయి. దానిపైనే గాంధీభవన్‌లో చర్చ జరుగుతోందట. పదవుల్లో మార్పులు చేర్పులపై కాంగ్రెస్‌లో కలకలం పీసీసీ కార్యవర్గంతోపాటు కొత్త డీసీసీల నియామకాలపై తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న మెజారిటీ నాయకులు..…
ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి కొత్త టీమ్‌ను ప్రకటించింది ఏఐసీసీ.. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఇవాళ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిశారు.. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఏపీలో పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన గిడుగు రుద్రరాజు.. మాది యంగ్ టీమ్.. పార్టీ బలోపేతం…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకమార్పులు చేసింది అధిష్టానం.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజుని నియమించింది అధిష్టానం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి. రాకేశ్ రెడ్డిని.. ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా ఎంఎం పళ్లంరాజును.. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్‌ను నియమించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఏఐసీసీ ఇచ్చిన పదవిని తిరస్కరించారు మాజీ ఎంపీ హర్షకుమార్.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి…
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. ఏఐసీసీ ఎన్నికల పోటీలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు ఇద్దరే ఉన్నట్లు ఆయన తెలిపారు.