ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు. ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గతేడాది అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే సుచిర్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ వాదనను అతడి తల్లిదండ్రులు తోసిపుచ్చారు. కచ్చితంగా ఇదే హత్యేనని వాదించారు.
AI Robo: కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) ఆధారంగా రూపొందించిన రోబోలు మనిషి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. వీటి సహాయంతో పరిశ్రమలు, ఆరోగ్య రంగం, విద్య, భద్రత వంటి అనేక విభాగాల్లో నూతన మార్గాలు సృష్టించబడుతున్నాయి. హ్యూమనాయిడ్ రోబోలు, ముఖ్యంగా, మనుషులను అనుకరించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి మానవ చర్యలను అర్థం చేసుకోవడం, అందుకు అనుగుణంగా స్పందించడం వంటి పనులు చేస్తాయి. కానీ, తాజా సంఘటనలు ఈ రోబోల భద్రతపై కొత్త చర్చలను…
Internet Users In India: భారతదేశంలో రికార్డు స్థాయిలో ఇంటర్నెట్ యూజర్లు పెరుగుతున్నారు. 2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లను దాటుతుందని గురువారం ఒక నివేదిక వెల్లడించింది. డిజిటల్ కంటెంట్ కోసం దేశంలోని ప్రాంతీయ భాషల వినియోగం పెరుగుతుండటం ఇంటర్నెట్ యూజర్ల పెరుగుదలకు కారణంగా ఉందని చెప్పింది. ఇండియాలో 2024 నాటికి ఈ సంఖ్య 88.6 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం బలమైన వృద్ధిని సూచిస్తుంది.
Software Engineers: మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నట్లు చెప్పారు.
AI Caught Thiefs: రాజస్థాన్లోని చురులోని రతన్గఢ్ ప్రధాన మార్కెట్లోని ఘంటాఘర్, ఘర్ కూడలి మధ్య ఉన్న నగల దుకాణంలో వారం క్రితం జరిగిన కోటి రూపాయల విలువైన చోరీ కేసులో, పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసును చేధించారు. ఈ విషయమై చూరు ఎస్పీ జై యాదవ్ సమాచారం అందించారు. ఏఐ (AI) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఠాలోని ముగ్గురు నిందితులను పోలీసు బృందం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. చోరీ ఘటనను దొంగలు…
సాంకేతికతతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలు సైతం ఉన్నాయన్నది నిజం. ప్రస్తుతం ఏఐ చాలా ఉపయోగకరమని అందరూ భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన విద్యార్థిని ఆందోళన కలిగించింది. గూగుల్ ఏఐని ఉపయోగించిన ఓ 29 ఏళ్ల విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తనను తిట్టడమే కాకుండా.. చనిపోవాలని చెప్పినట్లు ఆ విద్యార్థి తెలిపాడు.
ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు ఏపీ మంత్రి నారా లోకేష్.. రెడ్మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేష్ టీమ్.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అయ్యాంది.. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి చేరుకున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఏఐ సాయంతో సులువుగా ఫొటోలు, వీడియోలను రూపొందిస్తున్నారు. దీంతో అసలు ఫొటో ఏదో?, ఏఐ సాయంతో రూపొందించిన ఫొటో ఏదో? తెలుసుకోవడం కాస్త కష్టంగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ‘గూగుల్ ఫొటోస్’ సిద్ధమైంది. ‘ఏఐ ఇన్ఫో’ సాయంతో ఏఐతో క్రియేట్ ఫొటోలను సులభంగా గుర్తించవచ్చని తెలిపింది. Also Read: IND vs NZ Test: భారత్ ఓటమికి సీనియర్ ఆటగాళ్లదే బాధ్యత: కార్తీక్ ఏఐ ఇన్ఫో…
Mobile Connections: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనాలను ఉపయోగించి ఇప్పటివరకు 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు కేంద్ర సమాచార శాఖ తెలిపింది. దీని కింద నకిలీ పత్రాలు ఉపయోగించిన మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేయబడ్డాయి. దీనితో పాటు 45 లక్షలకు పైగా ఫేక్ కాల్స్ కూడా బ్లాక్ అయినట్లు సమాచారం. ఈ చర్య మోసం, సైబర్ నేరాలను అరికట్టడంలో సహాయపడుతుంది. అలాగే దేశ ప్రజల భద్రతకు భరోసా ఇస్తుంది. ఈ విషయంలో మరింత…
యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అన్ని పరిమితులను అధిగమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విద్యార్థులు తమ టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేశారు.