Another Domestic Smartphone Brand entered the mobile market: మరో మొబైల్ మార్కెట్లోకి మరో దేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రియల్‌మీ మాజీ సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవల ‘నెక్స్ట్‌క్వాంటమ్’ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ నుంచి ‘ఏఐ+’ బ్రాండ్ పేరుతో నేడు రెండు స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఏఐ+ పల్స్, ఏఐ+ నోవా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో ఏఐ+ పల్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ కాగా.. నోవా 5జీ స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఏఐ+ పల్స్, ఏఐ+ నోవా స్మార్ట్‌ఫోన్‌ల ఫుల్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
AI+ Pulse Smartphone Price and Specs:
ఏఐ+ పల్స్ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత NXTQ ఓఎస్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్‌రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో యూనిసోక్ టీ615 ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ఫోన్‌లో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా. అది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4Gజీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.4,999గా ఉండగా.. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది. జులై 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది.
Also Read: Crime News: అసూయ, పగ, ప్రతీకారం.. ఉన్మాదులుగా మారుతున్న మనుషులు! ఈ చిన్నమ్మే ఉదాహరణ
AI+ Nova 5G Smartphone Price and Specs:
ఏఐ+ నోవా స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్‌రేట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత NXTQ ఓఎస్ ఉంటాయి. యూనిసోక్ T8200 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండగా.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.7,999గా.. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. రెండు మొబైల్స్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ కలర్స్‌లో లభిస్తాయి. నోవా ఫోన్ జులై 13 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది.