చనిపోయిన అమ్మానాన్నలను AI ద్వారా ఫంక్షన్ లో స్క్రీన్ పై వీడియో చూసి ఓ బాలిక కన్నీరు మున్నిరైంది. కరీంనగర్ మారుతినగర్ కు చెందిన నిమ్మల చందు – సుమలత దంపతులు అనారోగ్యం కారణంగా 6 సంవత్సరాల క్రితం కన్నుమూశారు. అప్పటికే వారికి ఒక కుమారుడు, కుమార్తె కు ఉన్నారు. వారి అమ్మ నాన్నలు చనిపోయిన సమయంలో ఇద్దరు పిల్లలు చాలా చిన్నవారు. వారి అమ్మానాన్న ఎలా ఉంటారో కూడా తెలియని వయసులో ఆ చిన్నారులు వారి ప్రేమకు దూరం అయ్యారు. అయితే నిన్న ఆ చిన్నారి మనస్విక ఓణి ఫంక్షన్ ను కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హల్ లో చాలా గ్రాండ్ గా చేసారు. చిన్నతనం లోనే అమ్మానాన్నల ప్రేమకు దూరమైనా ఆ చిన్నారికి వారి కుటుంభ సభ్యులు సర్ ప్రైస్ ప్లాన్ చేసారు.
మనస్విక నానమ్మ, తాతయ్య, బాబాయ్ లు AI ద్వారా స్వర్గం నుండి తల్లితండ్రులు ఆ ఫంక్షన్ కు వచ్చినట్లు, చిన్నారిని హత్తుకున్నట్లు, వారితో ఫోటో దిగినట్లు స్క్రీన్ పై ప్లే చేయడం=తో చిన్నారి కన్నీరుమున్నిరైంది. చిన్నారే కాకుండా ఆ ఫంక్షన్ కు హాజరైన వారందరు కూడా ఆ వీడియో చూసి కంటతడి పెట్టారు. ఆ వీడియో చూస్తూ మనస్విక ఓ వైపు దుఃఖం తో మరోవైపు సంతోషం గా కనిపించింది. పిల్లల కోసం ఆ ప్లాన్ చేసిన వారి నానమ్మ తాతయ్య బాబాయ్ లను పలువురు ప్రశంసించారు.