గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు ఆకాశ్ వత్స అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. విమానం కూలడానికి రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ఆ విమానంలో ప్రయాణించినట్లు చెప్పాడు.
ఎయిరిండియా విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, గుజరాత్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. 2016 నుంచి 2021వరకు విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా సేవలందించిన విషయం తెలిసిందే. 242 మందితో ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Air India flight crash: ఎయిరిండియా విమాన ప్రమాదం 265 మంది మరణించారు. ఎందరో కలల్ని ఈ ప్రమాదం చెరిపేసింది. కేరళలోని పతినంతిట్ట జిల్లాలోని తిరువల్లకు చెందిన 39 ఏళ్ల నర్సు రంజిత్ గోపకుమార్ పెట్టుకున్న ఆశలన్ని కూలిపోయాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల్లో రంజిత కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన రంజిత యూకేలో నర్సుగా పనిచేస్తోంది. నాలుగు రోజుల క్రితం భారతదేశానికి వచ్చింది.
Boeing: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఎయిరిండియా ఆపరేట్ చేస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో కూలిపోవడంతో విమానంలోని 242 మందిలో 241 మంది మరణించారు. మెడికల్ కాలేజ్ హస్టల్‌పై కూలడంతో 24మమది మెడికోలు మరణించారు. అయితే, ఈ ప్రమాదం తర్వాత బోయింగ్ సంస్థపై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. భారతదేశ చరిత్రలో అతిపెద్ద వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. గురువారం, అహ్మదాబాద్ నుంచి లండర్ బయలుదేరిని బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందిలో ఒక్కరు మినహా అందరూ మరణించారు. క్రాష్ సైట్ వద్ద మరో 24 మంది చనిపోయారు.
ఆమె తన భర్త పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించింది. లండన్‌లో ఉన్న తన భర్తను కలిసేందకు బయలు దేరింది. విమానం గాల్లో ఎగిరిన కొన్ని నిమిషాలకే అనంతలోకాలకు చేరుకుంది. వాస్తవానికి.. ఇండోర్‌లోని హోరా కుటుంబానికి చెందిన కోడలు హర్‌ప్రీత్ కౌర్ హోరా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కన్నుమూశారు. లండన్‌లో ఉన్న భార్య, కుమార్తెను చూసేందుకు వెళ్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో విజయ్ రూపానీ విమానం ఎక్కారు.
Air India crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని 242 మందితో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం ఢీకొట్టిన క్రాష్ సైట్లో మరో 24 మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం లండన్‌కి బయలుదేరిన ఎయిరిండియా సంస్థకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 265 మంది మృతదేహాలకు సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం కొనసాగుతుంది. అయితే, విమాన ప్రమాదంలో ఛిద్రమైన కొన్ని మృతదేహాలు.. వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తిస్తున్నారు.
Ahmedabad Tragedy: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన 35 సెకన్లలోనే కుప్పకూలింది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలకు పేరుగాంచిన డ్రీమ్ లైనర్ ఇలా కూలిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.