Air India crash Investigation: గత వారం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్‌పోర్టుకు సమీపంలోని డాక్టర్స్ హాస్టల్‌పై కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 270 మంది మరణించారు. అయితే, ప్రమాదానికి రెండు ఇంజన్లు పనిచేయకపోవడం కారణమని పలువురు భావిస్తున్నారు. ఇంజన్ ఫెయిల్యూర్‌తో పాటు విద్యుత్ లేదా హైడ్రాలిక్స్ పనిచేయదని అంచనా వేస్తున్నారు.
Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటన తర్వాత, ఈ రోజు ఏకంగా 07 విమానాలను రద్దు చేశారు. రద్దు చేసిన విమానాల్లో 06 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ విమానాలు ఉన్నాయి.
Air India: అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదం తర్వాత, ఈ రోజు ఎయిరిండియా రెండు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాలలో సాంకేతిక సమస్యలు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్-లండన్, ఢిల్లీ -పారిస్ మధ్య నడిచే రెండు విమానాలను మంగళవారం రద్దు చేశారు.
Air India: ఎయిరిండియా ఘోర ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత ‘‘ఆపరేషనల్ సమస్యల’’ కారణంగా అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మధ్య నడిచే సర్వీస్ - AI 159 -ను రద్దు చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. అయితే, చిక్కుకుపోయిన ప్రయాణికులను వేరే మార్గాల్లో పంపిస్తామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు ఇంకా కళ్ల ముందే మెదులుతున్నాయి. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కుప్పకూలిపోయింది.
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అనేక కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. జూన్ 12 మధ్యాహ్నం లండన్ బయలుదేరి ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 270 మంది మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అయితే తాజాగా ఈ దుర్ఘటన జరిగిన నాటి నుంచి మ్యూజిక్ ఆల్బమ్స్ దర్శకుడు మహేశ్ జీరావాలా కూడా కనిపించకపోవడం, అతని కుటుంబాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. Also Read : Disha Patani : ప్రతి ఒక్క…
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. లండన్‌లో ఉంటున్న భార్య, కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రాణాలు చనిపోయారు.
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి టర్కిష్ టెక్నిక్ ఎయిర్ ఇండియాతో నిర్వహణ ఒప్పందాన్ని కలిగి ఉన్నప్పటికీ.. అది బోయింగ్ 777 వైడ్-బాడీ విమానాలకు మాత్రమే పరిమితం అని, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ను కవర్ చేయదని అధికారులు వివరించారు. ఈ ఒప్పందాలు 2024, 2025లో సంతకం చేయబడ్డాయి. Read Also: Phone Tapping : ఫోన్ ట్యాపింగ్…
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, అలాగే ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి తక్షణ ఆర్థిక అవసరాలను నిమిత్తం రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రూ. 1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే.
అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్‌లైనర్ విమానం క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదం అనంతరం భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది.