Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. భారతదేశ చరిత్రలో అతిపెద్ద వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. గురువారం, అహ్మదాబాద్ నుంచి లండర్ బయలుదేరిని బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందిలో ఒక్కరు మినహా అందరూ మరణించారు. క్రాష్ సైట్ వద్ద మరో 24 మంది చనిపోయారు.
Read Also: Air India crash: ఎయిర్ ఇండియా ప్రమాదంలో 1,000°C.. పక్షులు, కుక్కలు కూడా తప్పించుకోలేకపోయాయి.
అయితే, విమానం ఎలా కూలిపోయిందనే దానిపై ప్రస్తుతం పరిశోధకులు దర్యాప్తు చేస్తున్నారు. విమానానికి సంబంధించిన వీడియోలు పరిశీలిస్తే ఇంజన్ల వైఫల్యం ఉందని విశ్లేషకులు ప్రాథమికంగా నిర్ణయించారు. FASEC వైఫల్యమే అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణమని నిపుణులు ప్రాథమికం గుర్తించారు. ఈ ఫెయిల్యూర్ వల్ల ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ కారణంగా ఇంజన్లకు సరిగా ఇంధనం అందకపోవడంతోనే కూలినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత మాత్రమే స్పష్టత వస్తుందని చెబుతున్నారు.