Best Air Coolers: AC అవసరం లేదు.. రూ. 6 వేల లోపు బడ్జెట్‌లోనే బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Air Coolers: ఎండలు ముదురుతున్న వేళ సామాన్యులకు ఏసీలు కొనడం, వాటి కరెంట్ బిల్లులు కట్టడం భారంగా మారుతోంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలే కొనాల్సిన పనిలేదని చెబుతున్నారు నిపుణులు. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ విద్యుత్ వినియోగంతో ఇల్లు చల్లబరిచే బెస్ట్ ఎయిర్ కూలర్ల మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.6 వేల లోపు ధరలో లభించే టాప్ బ్రాండెడ్ ఎయిర్ కూలర్ల వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Puri and Paratha: పూరీ ఎందుకు ఉబ్బుతుంది..? పరాఠా ఎందుకు ఉబ్బదు..? ఆసక్తికర రహస్యం..
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
1. బజాజ్ PX 97 టార్క్ (Bajaj PX 97 Torque)
కూలింగ్ అప్లయన్సెస్ రంగంలో బజాజ్ ఒక నమ్మకమైన పేరు. ఈ మోడల్ ముఖ్యంగా చిన్న గదుల కోసం డిజైన్ చేయబడింది. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది, దీని ద్వారా గాలి ప్రసరణ చాలా వేగంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం మన్నిక కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
2. క్రాంప్టన్ జెనీ నియో (Crompton Ginie Neo)
నమ్మకమైన బ్రాండ్ కావాలి, అదే సమయంలో కరెంట్ బిల్లు తక్కువ రావాలి అనుకునే వారికి క్రాంప్టన్ జెనీ నియో సరైనది. ఇది చాలా తక్కువ విద్యుత్తును వినియోగిస్తూనే అద్భుతమైన కూలింగ్ ఇస్తుంది. పర్సనల్ స్పేస్ కోసం ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
3. సింఫనీ ఐస్ క్యూబ్ 27 (Symphony Ice Cube 27)
కూలర్ల తయారీలో సింఫనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులోని 27 లీటర్ల వాటర్ ట్యాంక్ వల్ల పదేపదే నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఇది బెడ్ రూమ్స్, చిన్న ఆఫీసులకు సరిగ్గా సరిపోతుంది. ఎక్కువ సేపు చల్లదనాన్ని ఇచ్చే సామర్థ్యం దీని సొంతం.
4. ఓరియంట్ ఎలక్ట్రిక్ స్మార్ట్‌కూల్ Dx (Orient Electric Smartcool Dx)
మీడియం సైజ్ గదులకు కూడా సరిపోయేలా ఓరియంట్ ఈ కూలర్‌ను డిజైన్ చేసింది. ఇందులో 20 లీటర్ల వాటర్ ట్యాంక్, ప్రత్యేకమైన ‘DenseNest’ హనీకోంబ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఇవి గాలిని వడపోసి మరింత చల్లగా మార్చి బయటకు పంపుతాయి.
5. హావెల్స్ ఫ్రెడ్డో ఐ (Havells Freddo i)
ప్రీమియం లుక్, ఫీచర్లు కోరుకునే వారికి హావెల్స్ ఫ్రెడ్డో ఒక మంచి ఆప్షన్. ఇది చిన్న గదులకు పర్ఫెక్ట్ కూలింగ్ అందిస్తుంది. ఇందులో వాడే హనీకోంబ్ ప్యాడ్‌లు గాలిని ఎక్కువ సేపు చల్లగా ఉంచుతాయి. బడ్జెట్ రేంజ్‌లో ఇది కూడా ఒక బెస్ట్ పర్సనల్ కూలర్.
READ ALSO: Jagapathi Babu: ఆ సినిమా నుంచి నాకు హీరోయినే లేదు: జగపతి బాబు
తాజావార్తలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!