ఎయిరిండియా విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, గుజరాత్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. 2016 నుంచి 2021వరకు విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా సేవలందించిన విషయం తెలిసిందే. 242 మందితో ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
READ MORE: Pawan Kalyan: ఇక్రిశాట్ స్కూల్ లో మార్క్ శంకర్ అడ్మిషన్!
అయితే.. తాజాగా మాజీ సీఎం విజయ్ రూపానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. విజయ్ ‘లక్కీ’ నంబర్ 1206. 1206 ను తన అదృష్ట సంఖ్యగా భావించి, తన వద్ద ఉన్న అన్ని వాహనాలకూ అదే నంబర్‌ను పెట్టుకున్నారు. తన స్వస్థలమైన రాజ్‌కోట్‌లో రూపానీ కారు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ 1206 ను చూసిన ఆయనను గుర్తుపట్టేవారట. తాను మొదటి నుంచి వాడిన స్కూటర్లు కూడా ఇదే నంబర్ పేరుతో ఉన్నాయట. ఈ ప్రమాదం కూడా జూన్ 12న జరిగింది. అంటే.. 12/06న ఆయన మృత్యువు ఒడికి చేరుకున్నారు. ఆయన లక్కీ నంబర్ (1206)యే ఇప్పుడు.. ఇదే ఆయన అంతిమ ప్రయాణ తేదీగా మారింది. గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే మేఘనినగర్ ప్రాంతంలోని ఒక వైద్య కళాశాల, హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లిన లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో రూపానీ కూడా ఉన్నారు.