ప్రతిష్టాత్మకమైన అగ్నిపథ్ పథకానికి అనుగుణంగా సరిహద్దు భద్రతా దళంలో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులతో 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Indian Army sings MoU with 11 banks for Agniveer salary package: భారత సైన్యం కొత్తగా తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నివీర్’. ఈ పథకం కోసం ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన సాలరీ ప్యాకేజీ కోసం 11 బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇండియన్ ఆర్మీ. అగ్నివీరులకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్,
Rakesh Tikait: మరోసారి భారత కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ భారీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ఆందోళనలు చేసిన రాకేష్ టికాయత్.. ప్రస్తుతం కేంద్రం తీసుకుచ్చని ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్’ఫై ఆందోళనకు సిద్ధం అవుతున్నాడు. ఆగస్టు 7 నుంచి అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా తమ రైతు సంఘం ప్రచారం ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. ఆగస్టు 7న ప్రారంభం అయ్యే…
అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అగ్నివీరుల ఎగ్జామ్ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ1, బీ1, సీ1 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కాగా.. రెండో షిఫ్టు 11.30 గంటలకు మూడో షిఫ్టు మధ్యాహ్నం 3.15 గంటలకు నిర్వహించనున్నారు. జూలై 24 నుంచి జూలై 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.
సైన్యంలో అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలువురు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేరళ, పంజాబ్, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే వీటన్నింటిపై మంగళవారం సుప్రీం కోర్టు విచారించింది. దేశవ్యాప్తంగా నమోదైన అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా నమోదైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టకు బదిలీ చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నాలుగు హైకోర్టుల్లో పిటిషన్లు…