సికింద్రాబాద్ రైల్వేస్టేష్ విధ్వంసం కేసులో సూత్రధారి అయిన సుబ్బారావు అరెస్టుతో కీలక అంశాలు వెలువడుతున్నాయి. సుబ్బారావుతో పాటు ముగ్గురు అనుచరులు అరెస్ట్ చేశారు పోలీసులు. రైల్వే ఎస్పీ అనురాధ మాట్లాడుతూ.. ఆవుల సుబ్బారావుతో పాటు అకాడమీ ఉద్యోగులు మరో ముగ్గురు అరెస్టే చేసినట్లు తెలిపారు. అకాడమీ ఉద్యోగులు శివ కుమార్, మల్లారెడ్డి, బీసీ రెడ్డి అదుపులో తీసుకున్నట్లు వివరించారు. నలుగురు పై రైల్వే యాక్ట్ తో పాటు 26 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసారని…
దేశవ్యాప్తంగా జరుగుతున్న అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్పందించారు. అగ్నివీరుల భవిష్యత్‌పై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో మనం కనిపించని శత్రువులపై యుద్ధాలు చేయాల్సిన అవసరం వస్తుందని.. ఈ నేపథ్యంలో దేశానికి యువత సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిపథ్‌ను సమర్థించిన అజిత్ ధోవల్.. యువ, సుశిక్షిత సేనలు దేశానికి అవసరమన్నారు. అగ్నిపథ్‌ను పథకాన్ని మరో కోణంలో చూడాలన్నారు. అగ్నిపథ్ అనేది 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు,…
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం విన్నవించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు కేవియట్ దాఖలు చేసింది. అగ్నిపథ్‌పై ఇప్పటివరకు మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది హరీశ్ అజయ్ సింగ్ సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్ దాఖలు చేసి…
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసింది.. మెమోరాండం సమర్పించింది.. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసిన లేఖను కూడా ఆయన జత చేశారు. సాయుధ బలగాల రిక్రూట్‌మెంట్ విధానంలో సమూల మార్పును ప్రకటించే ముందు, ప్రభుత్వం విస్తృతస్థాయి…
అగ్నిపథ్ పథకం ఇప్పుడు కాకరేపుతోంది.. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, బంద్‌లు కొనసాగుతుంటే.. మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా నోటిఫికేషన్లకు విడుదల చేస్తోంది కేంద్రం.. దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం నిర్వహించగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.. రేపు అనగా మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశం కాబోతున్నారు ప్రధాని మోడీ.. కర్ణాటక పర్యటనలో అగ్నిపథ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. కొన్ని…
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టని అగ్నిపథ్ పథకంపై విమర్శులు వెల్లువెత్తున్నాయి. అయితే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు జరుగుతున్నాయని, అయిన కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరమన్నారు. నిరుద్యోగ యువత అంటేనే బీజేపీ నాయకులు చిన్నచూపు చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష, 40 వేలు ఉద్యోగాలు ఇచ్చిందని, 2…
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ జరిగింది.. పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసమే జరిగింది.. ఆ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. అయితే, కేంద్రం మాత్రం వెనక్కి తగ్గకుండా మరో ముందుడుగు వేసి నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది.. ఇక, అగ్నిపథ్‌పై ఆందోళన వ్యక్తం అవుతోన్న సమయంలో.. అగ్నిపథ్, ఆ పథకాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతోన్న ఆందోళనపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్ణాటక పర్యటనలో…
అగ్నిపథ్ పథకంపై దేశంలో అగ్గి రాజుకుంది.. దేశవ్యాప్తంగా ఆందోళనలు, విధ్వంసాలతో అట్టుడికిపోయింది.. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. ఓవైపు నిరసనలు, ఆందోళనలు.. ఇలా దేశవ్యాప్తంగా ఏదో రూపంలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కార్యాచరణ సాగుతూనే ఉంది. అయితే, కేంద్రం మాత్రం అగ్నిపథ్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు.. ఈ విషయంలో మరో ముందుడు వేసింది నరేంద్ర మోడీ సర్కార్.. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు ముసాయిదా నోటిషికేషన్ జారీ చేసింది. ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్…
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ వివాదాస్పదంగా మారింది.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో యువత దీనిపై ఆందోళనకు దిగడం, విధ్వంసానికి పాల్పడడం చర్చగా మారింది.. అయితే, అగ్నిపథ్ పథకంపై కొంత మంది యువత అపోహకి గురయ్యారని చెబుతున్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్రివిధ సైనిక బలాల నిర్ణయం మేరకు అగ్నిపథ్ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పింది… ఈ ఏడాది 46…