ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయింది. మహిళలకు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. అయితే, ఇస్లామిక్ చట్టాల ప్రకారమే వారికి అవకాశం ఉంటుందని తాలిబన్లు చెబుతున్నారు. ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్టు ఇప్పటికే తాలిబన్లు ప్రకటించినా, భయాందోళనలు ఏ మాత్రం తొలగిపోలేదు. ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, కొంత మంది మహిళలు కాబూల్‌లో ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో నిలబడి నిరసనలు తెలిపారు. మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అలాంటి కాబూల్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా, మహిళలకు స్వేచ్చ కల్పించాలని,…
ఆఫ్ఘన్లో పరిస్థితిలు చాలా వేగంగా మారిపోయాయి.. ఎవ్వరూ ఊహించని తరహాలో తాలిబన్లు ఆఫ్ఘన్‌పై పట్టు సాధిస్తూ తక్కువ సమయంలో ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. ఆఫ్ఘన్‌ను విడిచి పరారయ్యాడు.. ఖరీదైన కార్లతో పాటు.. పెద్ద ఎత్తున క్యాష్‌ను తన వెంట తీసుకొని వెళ్లాడని ప్రచారం జరిగింది.. అయితే, ఇప్పుడు తానే ఆపద్ధర్మ అధ్యక్షుడిని అంటూ తెరపైకి వచ్చారు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్.. అధ్యక్షుడు దేశాన్ని విడిచి వెళ్లిపోవడంతో…
ఆఫ్ఘనిస్థాన్‌లో పాగా వేశారు తాలిబన్లు.. ఒక్కొనగరం.. ఒక్కొ రాష్ట్రం.. దేశ సరిహద్దులు ఇలా ఏవీ వదలకుండా అంతా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. ఆఫ్ఘన్ పరిస్థితుల ప్రభావం భారత్‌పై ఎంత మేరకు ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ.. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,…
ఏ మాత్రం బెరుకు లేకుండా క్రమంగా ముందుకు కదులుతూ.. తమ ఆకృత్యాలను కొనసాగిస్తూ మొత్తంగా ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్‌లోని ప్రధాన కార్యాలయాల్లోనూ పాగా వేశారు.. ఇక, ఆఫ్ఘన్ తమ వశం అయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటనలు చేశారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్.. గతంలో తమ వైఖరికి, విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు.. 20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని…
తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశారనే వార్తలు హల్ చల్ చేశాయి.. కార్యాలయ సిబ్బందిని మొత్తం భారత్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతుండగా.. కార్యాలయం మూసివేశారని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, వాటిపై స్పందించిన కేంద్రం.. అసలు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయలేదని క్లారిటీ ఇచ్చింది.. కాబూల్‌లోని భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని స్పష్టం చేసిన కేంద్రం.. దాదాపు 1,650 మంది భారతీయులు.. తిరిగి స్వదేశానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని వెల్లడించింది.…
హైదరాబాద్ లోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో మొత్తం 158 మంది ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన విద్యార్థులు ఉన్నారు అని యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ డైరెక్టర్ ప్రో. అప్పారావు తెలిపారు. ఓయూ హాస్టల్ లో నలుగురు ఉన్నారు. చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ రూమ్స్ అద్దె కి తీసుకుని ఉన్నారు. ఇప్పటివరకు విద్యార్థులు ఎవరూ ufro కార్యాలయానికి రాలేదు. మేమే స్టూడెంట్స్ ని ట్రేస్ చేస్తున్నాం. వాళ్ళు అడ్మిషన్ టైం లో ఇచ్చిన నెంబర్స్, ఇప్పుడున్న నంబర్స్ వేరేగా…
ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని తమకు ఎదురే లేదంటున్న తాలిబన్లకు షాక్‌లు కూడా తగులుతున్నాయి.. తాజాగా, జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆఫ్ఘన్‌కు డెవలప్మెంట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ విషయాన్ని జర్మన్ డెవలప్మెంట్ మంత్రి గెర్డ్ ముల్లర్ రినిష్ వెల్లడించారు.. డెవలప్మెంట్ ఫండ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్న ఆయన.. ఇదే సమయంలో.. అక్కడినుంచి వచ్చేయాలని భావిస్తున్న స్థానిక అభివృద్ధి అధికారులు, ఎన్జీవోలకు చెందిన సభ్యులను దేశానికి రప్పించే చర్యలు మాత్రం కొనసాగిస్తామని తెలిపారు. అయితే, ఏడాదికి 430…
ఆఫ్ఘనిస్థాన్‌ను మళ్లీ తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో.. చాలా హృదయవిదారకమైన పరిస్థితులు కనిపిస్థున్నాయి.. ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని.. దేశాన్ని విడిచి వెళ్లేందుకు చేయని ప్రయత్నాలు లేవు.. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌లో భయంకరమైన రద్దీ కనబడుతోంది.. విమానం టేకాన్‌ను వెళ్లే సమయంలోనూ వెంటపడి మరి.. చక్రాల దగ్గరైనా చోటు దొరకకపోతుందా? అంటూ వేలాడి వేళ్లేవాళ్లు కొందరైతే.. మరికొందరు జారిపడి ప్రాణాలు కూడా వదిలారు.. అయితే, ఏదేమైనా.. తాలిబన్లు నా ప్రాణం తీసినా సరే.. తాను మాత్రం కాబూల్‌ను వదిలేది లేదంటున్నారు…