ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో రాజధాని కాబూల్‌లోని అన్ని దేశాలు తమ ఎంబసీలను ఖాళీ చేసి స్వదేశం వెళ్లిపోతున్నాయి. అధికారులను, భద్రతా సిబ్బందిని స్వదేశానికి తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కాబూల్ విమానశ్రయం నుంచి భారత రాయబార అధికారులు, భద్రతా సిబ్బంది 120 మందిని సీ 17 వైమానిక విమానం ద్వారా ఇండియాకు తరలించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు సీ 17 విమానం చేరుకున్నది. కాబూల్ నుంచి వచ్చిన వీరికి విదేశాంగ శాఖాధికారులు స్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న…
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా భయం భయంగా తిరుగుతున్న ప్రజలు కనిపిస్తున్నారు. ఎవరు ఎటునుంచి వచ్చి కాల్పులు జరుపుతారో… ఎవర్ని ఎత్తుకుపోయి చంపేస్తారో.. ఏ మహిళ కనిపిస్తే ఏం చేస్తారో అని భయాందోళనల మధ్య కాలం వెల్లబుచ్చుతున్నారు. కాబూల్ నగరం చుట్టూ తాలిబన్లు పహారా కాస్తుండటంతో బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు. ఇప్పుడున్న ఏకైక మార్గం కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో ఏదోక దేశం వెళ్ళి తలదాచుకోవడమే. దీంతో పెద్ద సంఖ్యలో ఆఫ్ఘన్ ప్రజలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.…
ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటి వరకు సాగిన పాలనకు పూర్తి విరుద్దంగా పాలన జరగబోతున్నది. తాలిబన్ల చేతిల్లోకి అధికారం వెళ్లిపోయింది. రెండు దశాబ్దాల క్రితం ఎలాంటి కౄరమైన పాలనను అక్కడి ప్రజలు చూశారో దాదాపుగా అదేవిధమైన పాలనలను మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు. తాము శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతున్నప్పటికీ వారు ఎలాంటి పాలన అందిస్తారో అందరికీ తెలిసిందే. మహిళలు, చిన్నపిల్లలకు ఆ దేశంలో రక్షణ ఉండదు. 12 ఏళ్లు దాటిన మహిళలు ఎవరూ బయటకు రాకూడదు. చదువు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ఇంకా పూర్తిగా అధికారాన్ని చేజిక్కించుకోకముందే తమ ఆరాచక పాలనను మొదలుపెట్టారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తున్నారు. దీనికి సంబందించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబూల్‌లోని ప్రజలను ఏమీ చేయబోమని చెబుతూనే, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, యూఎస్ ఆర్మీకి సహకరించిన వారి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్లి వివరాలు కనుక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో కాబూల్ వాసుల్లో తెలియని భయం నెలకొన్నది. ఇప్పటి వరకు సాధారణ జీవనం…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక ఆక్కడ పరిస్థితులను రష్యా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. 2001 కి ముందు కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను పరిపాలించారు. అయితే, వారి అరాచక పాలన ఎంతో కాలం సాగలేదు. 2001లో ఉగ్రవాదులు అమెరికా వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై దాడులు చేసి కూల్చివేసిన తరువాత అమెరికా సైన్యం ఆఫ్ఘన్ లోకి అడుగుపెట్టి తాలిబన్లను తరిమికొట్టింది. అంతకు ముందు అంటే, 1979 ప్రాంతంలో అఫ్ఘన్‌కు రష్యా సహకారం అందించింది. ఆప్రాంతాన్ని సోవియట్ యూనియన్ తమ ఆధీనంలోకి…
ఏకే 47, రాకెట్ లాంచర్లు ఉంటేనే ఆఫ్ఘనిస్తాన్‌ను గజగజవణికిస్తున్నారు. అదే అధుతాన ఆయుధాలు, వైమానిక ఆయుధసంపత్తి ముష్కరుల చేతికి దొరికితే ఇంకేమైనా ఉన్నదా… ఆఫ్ఘన్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. గత 20 ఏళ్ల కాలంలో 89 బిలియన్ డాలర్లతో ఆఫ్ఘనిస్తాన్‌కు అమెరికా అధునాత ఆయుధాలు, యుద్ద విమానాలు, హెలికాఫ్టర్లు, యుద్ధ ట్యాంకులు, 11 వైమానిక స్థావరాలను సమకూర్చింది. ఎలా వీటిని వినియోగించాలో సైనికులను తర్ఫీదు ఇచ్చింది. సైనిక శిక్షణ ఇచ్చింది. ఇన్ని చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలు తప్పుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సెప్టెంబర్ 11 వరకు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రక్రియను అమెరికా వేగవంతం చేయడంతో తాలిబన్లు దురాక్రమణకు పాల్పడ్డాయి. వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాయి. ఆదివారంరోజున రాజధాని కాబూల్ నగరంలోకి ప్రవేశించడంతో ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయింది. ఈ పరిస్థితికి అమెరికానే కారణం అని ప్రపంచం మొత్తం విమర్శలు చేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్…