అటు తాలిబాన్ .. ఇటు ఇరాన్ .. మధ్యలో ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో వ్యవహారం రెండు వైపులా పదునైన కత్తిలాంటిదనే వ్యవహరం మరోసారి రుజువైంది . అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఎంతో వ్యూహాత్మంగా చబహార్ పోర్టుపై పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఆల్టర్నేట్ మిడిల్ ఈస్ట్ ఏషియా , యూరప్ దేశాలతో నేల మార్గం ద్వారా జరిగే వ్యాపారం ఇప్పటి వరకు ఎక్కువగా పాకిస్తాన్ మీదుగా జరుగుతోంది. దీంతో పాకిస్తాన్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ప్రత్యామ్నయంగా ఇరాన్లో చబహార్ పోర్టును అభివృద్ధి చేసేందుకు ఇండియా ముందుకు వచ్చింది . ఈ పోర్టుకి అనుసంధానంగా రైలు , రోడ్డు ప్రాజెక్టును నిర్మించడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఇండియా ప్రణాళిక రూపొందించింది . అమెరికా సైతం ఈ ప్రాజెక్టుకు సానుకూలంగానే స్పందించింది .
హైవే నిర్మాణం అఫ్ఘనిస్తాన్ పునర్ నిర్మాణం పేరుతో 150 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరాజ్ – దేలారమ్ హైవేను మన దేశానికి చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది . రైలు మార్గానికి సంబంధించిన పనులు చర్చల దశలో ఉన్నాయి . ఇక చబహార్ పోర్టు ప్రస్తుత సామర్థ్యం 8 మిలియన్ టన్నులు ఉండగా దాన్ని 80 మిలియన్ టన్నులకు పెంచేలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ఇండియా తీసుకుంది . తద్వారా భవిష్యత్తులో పోర్టు ద్వారా వచ్చే ఆదాయంలో ఇరాన్ – ఇండియాలు షేర్ చేసుకోవాలనే ఒప్పందం కుదిరింది .
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఇరాన్‌పై ఆంక్షలు ప్రపంప పెద్దన్న హోదాలో న్యూక్లియర్ డీల్ విషయంలో ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించింది అమెరికా . దీంతో ఇరాన్లో ఇండియా చేపట్టిన చబహార్ పోర్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపించలేదు . కనీసం క్రేన్లు సరఫరా చేసేందుకు సైతం ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు . ఇరవై సార్లకు పైగా టెండర్లు పిలిచినా నిరాశే మిగిలింది . మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో హైవే నిర్మాణ పనులు పూర్తయ్యాయి . చబహార్ పోర్టు నిర్మాణం పూర్తయి ఉంటే ఈ హైవే వల్ల ఇండియాకు ప్రయోజనం చేకూరి ఉండేది . కానీ అమెరికా ఏకపక్ష ఆంక్షల కారణంగా ప్రత్యక్షంగా ఇరాన్ , పరోక్షంగా ఇండియా నష్టపోయాయి . మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగమైన రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పుడు చైనా ఆసక్తి చూపిస్తోంది .
చబహార్ పోర్టు పెట్టుబడి వృధాయేనా పేరుతో దాదాపు వన్ బిలియన్ డాలర్ల వరకు ఇండియా పెట్టుబడులు పెట్టింది . తాజాగా అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోవడంతో గతంలో జరిగిన ఒప్పందాలు ఎంత మేరకు ఫలితాలను ఇస్తాయంటే సమాధానం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు . మరోవైపు ఇండియా అమెరికా ట్రాప్లో పడి చబహార్ పోర్టు పనుల్లో చాలా జాప్యం చేసిందనే వాదన ఇరానీయుల నుంచి వినిపిస్తోంది . పూర్తి చేయండి అఫ్ఘనిస్తాన్ పునర్మిణం కోసం ఇండియా చేపట్టిన పనులు పూర్తి చేస్తే మాకేమీ అభ్యంతరం లేదని , సహకారం అందిస్తామంటూ తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ పాక్ మీడియాకు వెల్లడించారు . అదే సమయంలో విదేశీ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఆఫ్ఘన్ నేలను ఉపయోగించుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు . దీంతో గాంధర నేలపై ఇండియా పెట్టిన పెట్టుబడులు నిష్పలం అయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి .
- Tags
- Afghanistan
- india
- Iraq
- talibans
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!