తాలిబన్ల అరచకాలకు భయపడి ఆఫ్ఘన్ ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు పోటీ పడ్డారు.. తాలిబన్లు కాబూల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత.. కొన్ని హృదయవిదారకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.. పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌ల్లోకి దూసుకెళ్లిన ప్రజలు.. ఎలాగైనాసరే ప్రాణాలతో బయటపడితే చాలు.. అనే తరహాలో.. విమానాలపైకి ఎక్కారు.. విమానాలు టేకాన్‌కు వెళ్తుంటే.. పరుగులు పెట్టి మరీ.. విమానాల చక్రాల దగ్గరై చోటుకోసం ప్రయత్నాలు చేశారు.. అలా విమానాలు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులకంటే ఘోరంగా దర్శనమిచ్చాయి.. అలా విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత జారిపడి మృతిచెందిన ఘటనలు కలకలం సృష్టించాయి. ఆ ఘటనలో ఓ యువ ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా ప్రాణాలు వదలడం అందరి హృదయాలను కలిచివేస్తోంది.
మూడు రోజుల క్రితం కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి గాల్గోకి ఎగిర యూఎస్ మిలటరీ విమానం నుంచి.. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు జారీపడిన దృశ్యాలు అందరినీ కలచివేశాయి.. అందులో 19 ఏళ్ల జాకీ అన్వారీ అనే యువ ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా ఉన్నాడు.. ఎంతో భవిష్యత్ ఉన్న మంచి ప్లేయర్.. ప్రాణాలు ఆకాశానికి ఎగిరిన విమానం నుంచి గాల్లో కలిసిపోయాయి. ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జూనియర్ ఫుట్‌బాల్ జట్టులో ఆడిన ఆ యువకుడు.. యూఎస్ మిలటరీ విమానం నుంచి కిందపడి మరణించాడు.. ఆఫ్ఘన్ స్పోర్ట్స్ సొసైటీ ఈ విషయాన్ని వెల్లడించింది. జాకీ అన్వారీ.. మంచి ప్రతిభ గలిగిన ప్లేయర్‌గా పేర్కొంది. కాగా, ఇక యుద్ధం ముగిసిందని ప్రకటించిన తాలిబన్లు.. మళ్లీ డోర్ టు డోర్ తనిఖీలు చేపట్టడం ఆందోళనకు గురిచేస్తోంది.. మరికొందరు తాలిబన్లకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.