ఆఫ్ఘనిస్తాన్‌లో అరాచక పాలన మొదలైంది. శాంతి మంత్రం జపిస్తూనే తాలిబన్లు తమ మార్క్ హింసను చూసిస్తున్నారు. దేశం విడిచిపారిపోవాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లేవారిపై దాడులు చేయడం, కాల్పులు జరపడం చేస్తున్నారు. గత ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు తాలిబన్లు. ఇక మహిళల విషయంలో తాలిబన్లు ఎంతటి కౄరంగా ప్రవర్తిస్తారో వేరే చెప్పక్కర్లేదు. మహిళలు ఒంటరిగా బయటకు వస్తే వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే గ్యారెంటీ లేదు. షరియా చట్టాల ప్రకారం పాలన సాగుతుంది కాబట్టి మహిళలు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళల విషయంలో తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న మహిళలు తాలిబన్ల నిర్ణయంతో మరింత భయాందోళనలు కలుగుతున్నాయి.
Read: పంజ్‌షీర్ తాలిబన్ల వశం అవుతుందా? అగ్ర దేశాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి?