ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా సామాన్య ప్రజలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. కాల్పులు జరుపుతున్నారు. శాంతి మంత్రం వల్లెవేస్తూనే, అరాచకాలు సృష్టిస్తున్నారు. మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే విదేశీ మీడియా సంస్థలు, ప్రతినిధులు, జర్నలిస్టులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఉన్న మీడియా క్షణక్షణం భయం భయంగా వార్తలను అందిస్తోంది. తాలిబన్లకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని చేస్తున్నప్పటికీ వారి అరాచకాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా, స్థానిక న్యూస్ మీడియా టోలో న్యూస్‌కు చెందిన జర్నలిస్ట్ జియాద్ యార్‌ను తాలిబన్లు హత్యచేశారు. ఈయనతో పాటు కెమెరామెన్ ను కూడా తాలిబన్లు చితక్కొట్టారు. అయితే, కెమెరామెన్ ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న పేదరికం గురించి, నిరుద్యోగం గురించి వీరు రిపోర్టింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇంతకు ముందు తాలిబన్లు భారత ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్ధికీని కూడా తాలిబన్లు హత్యచేశారు.
Read: అక్కడి నుంచి పిడికెడు మట్టి కూడా తేలేకపోయా… ఆఫ్ఘన్ సిక్కు మహిళా ఎంపీ ఆవేదన…