తాలిబన్లు రెండోసారి ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. 1994లో మొదటిసారి తాలిబన్లు ఆఫ్ఘన్ దురాక్రమణకు పూనుకోవడం, 1996లో అధికారంలోకి రావడంతో ఆక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే కాకుండా పాక్‌లోనూ తాలిబన్లు వారి ఉనికిని చాటుకున్నారు. 9 ఏళ్ల క్రితం తాలిబన్లు పాక్‌లోని క్వెట్టా ప్రాంతంలోకి ప్రవేశించి స్కూల్ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విద్యార్ధిని మలాలా యూసెఫ్‌జాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత ఆమెను పెషావర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడి నుంచి లండన్ తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేయడంతో కోలుకున్నది. అయితే ఇప్పటికీ తలకు తగిలిన బుల్లెట్ గాయం కారణంగా ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటోంది. రెండు వారాల క్రితం మరో ఆపరేషన్ నిర్వహించారు. ఆమెకు ఆపరేషన్ నిర్వహించే సమయంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారని వార్తలు తెలియడంతో మలాలా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. దశాబ్దాల తరబడి ఆఫ్ఘన్ ప్రజలు తుపాకీ తూటాల శబ్దాలకు భయపడిపోతున్నారని, వాది ఆవేదన అరణ్యరోదనగా మారిందని అన్నారు.
Read: కేరళలో అదుపులోకిరాని కరోనా… భయాందోళనలో ప్రజలు…