ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్.. అక్కడ తాలిబన్ల పాలనపైనే ఉంది. ఈసారి ఇండియాలో ఉన్న తాలిబన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌లో తాలిబన్ క్రికెట్ క్లబ్ పేరుతో ఓ టీమ్ ఉంది. ఆ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఉన్న భనియానా గ్రామంలో జరుగుతున్న టోర్నీలో ఈ క్లబ్ ఓ మ్యాచ్ కూడా ఆడింది. అయితే ఆ తర్వాత ఈ క్లబ్ పేరుపై వివాదం చెలరేగడంతో… నిర్వాహకులు ఆ టీమ్‌పై నిషేధం విధించారు. అసలు టోర్నీలో ఈ టీమ్‌ను చేర్చడం పొరపాటని, అందుకే ఆ క్లబ్‌ను తీసివేసినట్లు నిర్వాహకులు స్పష్టం చేసారు. చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది.