తాలిబన్లకు ముచ్చెమటలు.. పంజ్‌షీర్‌లో చుక్కలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్‌ను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకోవడానికి తాలిబన్లకు ముచ్చెమటలు పడుతున్నాయి… దేశ రాజధాని కాబూల్‌ను సైతం వాళ్లు స్వాధీనం చేసుకున్నారు.. అమెరికా సైన్యం సైతం కాబూల్‌ను ఖాళీచేయడంతో సంబరాలు చేసుకున్నారు.. అయితే, తాలిబన్లకు పంజ్‌షీర్ లో మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. పంజ్‌షీర్…అంటే ఐదు సింహాలు అని అర్థం. పేరుకు తగ్గట్టే… పంజ్‌షీర్ ప్రజలు పోరాడుతున్నారు. తమ ప్రాంతంలోకి తాలిబన్లను అడుగు పెట్టనివ్వకుండా… పోరాటం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు… ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదు. పంజ్‌షీర్ సైన్యం నుంచి ఊహించని విధంగా.. ప్రతిఘటన ఎదురవుతోంది. ఏకఛత్రాధిపత్యానికి కొరకరాని కొయ్యగా మారిన… ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు బెడసికొడుతున్నాయి.
తాలిబన్లను పంజ్‌షీర్ దళాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. పంజ్‌షీర్‌ను ఎలాగైనా వశం చేసుకొనేందుకు… తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. వందల సంఖ్యలో తమ ఫైటర్లను కోల్పోయింది. ఖవాక్ వద్ద జరిగిన యుద్ధంలో… 350 మంది తాలిబన్ ఫైటర్లను మట్టుబెట్టినట్టు ఉత్తర కూటమి దళాలు ప్రకటించాయి. మరో 40మందికి పైగా తాలిబన్ ఫైటర్లను పట్టుకొని ఖైదు చేసినట్టు ట్విటర్‌లో తెలిపింది. అమెరికా దళాలు పూర్తిగా నిష్క్రమించడంతో… త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు తాలిబన్లు. పంజ్‌షీర్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా… ఆ ప్రాంతం నేతలతో చర్చలు విఫలమయ్యాయి. పంజ్‌షీర్ ఫైటర్లు ఆయుధాలు వీడి రావాలని విజ్ఞప్తి చేసినప్పటికీ… వారు పట్టించుకోవడం లేదు. యుద్దానికే సై అంటున్నారు. తాలిబన్ నేతలకు లొంగిపోయే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!