Pakistan: ఆర్థిక, రాజకీయ అస్థిరత రాజ్యమేలుతున్న పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఈ దాడులకు ఆఫ్ఘాన్ జాతీయులు కారణం కావచ్చని పాకిస్తాన్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న ఆఫ్ఘన్ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 1లోగా తమ దేశంలో ఉన్న 17 లక్షల మంది ఆఫ్ఘాన్లు పాకిస్తాస్ వదిలి వెళ్లాలని హుకూం జారీ చేసింది.
ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్‌పై పాకిస్థాన్ ఇప్పుడు ఎదురుదాడికి తెరతీసింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు నవంబర్ 1లోగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు దాటిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Afghanistan: భారతదేశంలో ఆఫ్ఘానిస్తాన్ తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. న్యూఢిల్లీలో ఆఫ్గాన్ ఎంబసీ మూసివేసింది. గత కొన్ని నెలలుగా భారత్ లో ఆఫ్ఘాన్ రాయబారి లేరు. ఢిల్లీలోని ఆఫ్ఘాన్ దౌత్యవేత్తలు కూడా యూకే, అమెరికా వెళ్లి ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత్ లో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ముగ్గురు రాయబార కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2023 ప్రపంచకప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్‌ను ప్రొలాంగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు.
Afghanistan: తాలిబాన్ చట్టాలు, మహిళ హక్కుల ఉల్లంఘన, నిరుద్యోగం, ఉగ్రవాదం ఇలా పలు రకాల సమస్యల్లో చిక్కుకుంది ఆఫ్ఘనిస్తాన్. అయితే ఒక్క విషయంలో మాత్రం ప్రపంచంలో టాప్ స్థానంలో నిలిచింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం.. ఈ త్రైమాసికంలోనే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ప్రపంచంలోనే అత్యుత్తమ కరెన్సీగా అవతరించింది. ‘బెస్ట్ ఫెర్ఫామింగ్ కరెన్సీ’గా నిలిచింది. ఈ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘని విలువ 9 శాతం పెరుగుదల కనిపించింది. మానవతా సాయంగా ఇతర దేశాలు బిలియన్ డాలర్లు సాయం చేయడం,…
ఆసియా కప్ 2023 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఆ జట్టు కప్ నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను దురదృష్టం ఓడించింది.
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ప్రధాన సరిహద్దులో బుధవారం కాల్పులు జరిగాయని, ఆ తర్వాత ఆఫ్ఘన్-పాకిస్తాన్ సరిహద్దును మూసివేసినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి.
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. కొత్త కొత్త రూల్స్ తో ధర్మం పేరుతో అక్కడి వారికి కొంచెం కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు తాలిబన్లు. ఎప్పటి నుండి అయితే దేశాన్ని తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారో అప్పటి నుంచి మహిళలకు నరకం చూపెడుతున్నారు. వారిపై ఉక్కు పాదం మోపుతూనే ఉన్నారు. మొదట వారిని చదువు నుంచి దూరం చేశారు. తరువాత ఉద్యోగం నుంచి, క్రీడల నుంచి అన్నింటి…
అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నెంబర్-1 స్థానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేయడంతో.. మళ్లీ నెంబర్-1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్ సేన టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.