ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ.. పెళ్లి కోసం కిడ్నాప్ డ్రామా
నేటి తరం యువత మంచి చెడులకు తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ కన్నవాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు వయసుతో సంబంధం లేకుండా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లను వాడుతున్నారు. సోషల్ మీడియాను వాడడం తప్పు కాదు కానీ విచ్చలవిడిగా వాడి.. ముఖపరిచయం లేని వ్యక్తులతో స్నేహాలు పెంచుకుని వాటికి ప్రేమ అనే పేరు పెట్టుకుంటే.. అసలుకే ముప్పు వస్తుంది. ఆ తప్పు జరగక ముందే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.. మీ పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచాలి. సోషల్ మీడియాలో సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కిడ్నాప్ అయ్యి కలకలం రేపిన విద్యార్థి కేసులో అసలు నిజం వెలుగు చూసింది.
గద్దర్ మరణం తెలంగాణ సమాజానికే తీరని లోటు
ప్రజా గాయకుడు గద్దర్ సమాజానికి ఉపయోగపడేటటువంటి గొప్ప వ్యక్తి అని, ప్రజా యుద్ధ నౌక.. ఒక గాయకుడు.. పేరుండి కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఎన్టీవీతో మంత్రి తలసాని మాట్లాడుతూ.. ద్దర్ మరణం తెలంగాణ సమాజానికే తీరని లోటని, తన గానం తో తెలంగాణ ప్రజానీకానికి చైతన్యం కలిగించాడని ఆయన వ్యాఖ్యానించారు. తన వేషధారణ చూస్తేనే అర్థమవుతుంది.. ఎంత నిరాడంబరంగా జీవించాడోనని, కొందరు ఇక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు.. మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
గద్దర్ ఒక పార్టీ నేత కాదు.. ప్రజా నాయకుడు.. తెలంగాణ గొంతుక.. పద్ధతి మానుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్ కూడా కీలక వ్యక్తి అని మంత్రి తలసాని అన్నారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. దీన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారని, గొప్ప వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావించాలన్నారు మంత్రి తలసాని. ఇదిలా ఉంటే… తెలంగాణలో పూర్తిగా అనుకున్న ఆశయాలు నెరవేకుండానే గద్దర్ వెళ్లిపోయారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన ఎక్కడి ఇబ్బందులు అక్కడే ఉన్నాయని గద్దర్ భావించారన్నారు. దానిలో బాగంగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని తనతో గద్దర్ చెప్పారని వెల్లడించారు. గద్దర్ భావించిన , ఉహించిన తెలంగాణ రాలేదని చాల బాధ పడ్డారని కిషన్ రెడ్డి తెలిపారు. నిజానికి చాలా సందర్భాల్లో గద్దర్ సైతం ఈ విషయాన్ని వెల్లడించారు.
గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు ముఖ్యం
దేశంలోని గ్రామాల్లో గ్రామపంచాయతీరాజ్ వ్యవస్థను తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హర్యానాలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రాంతీయ పంచాయతీరాజ్ కౌన్సిల్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో జరిగిన కార్యక్రమంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు ఓపీ ధన్‌ఖడ్ తదితరులతో కలిసి మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనం చేసిందని ప్రధాని విమర్శించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయడం ఎంత అవసరమో కాంగ్రెస్‌కు అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత ఏర్పాటైన జిల్లా పంచాయతీ వ్యవస్థను కాంగ్రెస్ హయాంలో వాటి భవితవ్యానికి వదిలేసిందని ప్రధాని మోదీ అన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమ్ము లోయలో మొట్టమొదటిసారిగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనంతరం గ్రౌండ్ లెవెల్లో ప్రజాస్వామ్యం స్థాపించబడిందని ప్రధాని తెలిపారు. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత, మొదటిసారిగా గ్రామ పంచాయతీ నుండి జిల్లా స్థాయికి ఎన్నికలు జరిగాయన్నారు.
సుప్రీంకోర్టులో వనమాకు ఊరట
సుప్రీంకోర్టులో సోమవారం వనమాకు ఊరట లభించింది. కొత్తగూడెం బీఆర్‌ఎస్ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని జలగం వెంకట్రావు వేసిన ఎలక్షన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలిసిందే. అయితే.. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టులో అప్పీలు వేశారు. వాదనలు విన్నఅనంతరం తెలంగాణ హైకోర్టు తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో యధావిధిగా వనమా ఎమ్మెల్యేగా కొనసాగుతారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వనమా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ కష్టకాలంలో తన వెంట ఉన్న నియోజకవర్గ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధనపై సీఎస్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధనపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. కృత్రిమ మేధస్సు ద్వారా విద్యాబోధనకు కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో పూర్తి స్థాయిలో కెపాసిటీ బిల్డింగ్ చేయాలన్నారు. దీని కోసం టెక్నికల్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీనికి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎస్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మొబైల్ యాప్‌ల నుంచి ఆన్‌లైన్ కోర్సుల వరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోందని ఆయన అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కృత్రిమ మేధస్సు గురించి అవగాహన పెంచాలని అధికారులకు సీఎస్ సూచనలు చేశారు.
గ్రాఫిక్స్ చూపించటం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా?
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ విరుచుకుపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టు గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌ది మాత్రమేనని ఆయన అన్నారు. ప్రాజెక్టుల మీద చంద్రబాబు యుద్దం ప్రకటించాననటం హాస్యాస్పదమన్నారు. రైతులను మోసం చేసిన రైతు ద్రోహి చంద్రబాబు అంటూ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. రెండు టన్నెల్స్ త్వరలో ప్రారంభిస్తామని.. ప్రాజెక్టు నిర్వాసితులకు సమస్యలు పరిష్కరించిన తర్వాతే నీటిని విడుదల చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. ప్రకాశం జిల్లాకు ఏమి చేశారో చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజలు సీఎం జగన్ పక్షానే ఉన్నారని ఆయన పేర్కొ్న్నారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు ఎన్ని వైపుల నుంచి తిరిగినా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
దాడి చేస్తే ఊరుకోం… పవన్ పై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్..
వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరి మీదా దారుణ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు, అవసరం కోసం వాడుకోవడం ఉందని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబుతో కలిస్తే పవన్ కి ఎన్టీఆర్ కి పట్టిన గతే పడుతుందని అన్నారు. పవన్ ప్రజల్లో తిరగవచ్చు, జగన్ మీద విమర్శలు చేయవచ్చు కానీ ముందుగా రాజకీయాల్లో ఉండే దొంగలు, 420 లను పక్కన పెట్టాలని హితవు పలికారు. పవన్ ప్రజల మధ్య వారాహి యాత్ర చేస్తే ఇబ్బంది ఏమీ లేదని పేర్కొన్న ఆయన పవన్ తో నేరుగా కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తే కుదర లేదని అందుకే మీడియా ముఖంగా చెబుతున్నానని అన్నారు.
చంద్రబాబు ఎప్పుడూ సీఎంగా ఉండాలని కోరుకునే వారు పవన్ కు మద్దతు దారులుగా మారారని, పవన్ మద్దతుతో చంద్రబాబుని ప్రతిపక్ష నేతగా చేయాలని ఆయన మద్దతు దారులు భావిస్తున్నారని కొడాలి నాని అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మద్దతుదారులతో కలిసి పవన్ మాపై దాడి చేస్తే ఊరుకోమని పేర్కొన్న ఆయన చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ అమలు చేస్తే రాజకీయంగా ఎదుర్కొంటామని పేర్కొన్న ఆయన చంద్రబాబుకు సపోర్ట్ చేసే వారు ఎవరైనా బట్టలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక గతంలో టీడీపీ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన కొడాలి నాని 2014 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకుని అప్పటి నుంచే జగన్ కు నమ్మిన బంటుగా మారారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి కూడా అయిన ఆయన తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మాత్రం పదవికి దూరమై ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
పర్సనల్ డేటా రక్షణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
దేశంలో ఇకపై వ్యక్తులకు సంబంధించిన పర్సనల్ డేటా సురక్షితంగా ఉండనుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ సోమవారం ఆమోదించింది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంతో.. రాజ్యసభకు చర్చకు పంపించనున్నారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2022లో మొదటిసారిగా ప్రవేశపెట్టబడినప్పటికీ.. అపుడు ఉపసంహారించుకున్నారు. తిరిగి ఆ నెల 3న లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.
లోక్‌సభలో ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనల మధ్య డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) బిల్లును సభ ఆమోదించింది. పౌరుల డేటాను ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థలు ఎలా ఉపయోగించవచ్చో లేదా ప్రాసెస్ చేయవచ్చో నిర్ధారించే మొదటి చట్టానికి భారతదేశం ఒక అడుగు దూరంలో ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందండంతో ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభకు వెళ్లనుంది. అయితే అక్కడ అధికార కూటమికి మెజారిటీ మార్కు తక్కువగా ఉంది. చట్టంపై లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షం, తదుపరి చర్చల కోసం బిల్లును పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపాలని డిమాండ్ చేసింది. పౌరుల గోప్యత హక్కును ఈ బిల్లు ఉల్లంఘిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లుకు సవరణలను ప్రతిపాదించారు. అందులో పిల్లల నిర్వచనాన్ని 18 ఏళ్ల వయస్సు పరిమితి నుండి 15 ఏళ్లలోపు వారికి తగ్గించాలని సూచించారు.
పీవీ నరసింహారావు మేధో సంపత్తి ఉన్న వ్యక్తి
నిజామాబాద్ నగర శివారులోని బొర్గం వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ వానిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పీవీ మేధో సంపత్తి ఉన్న వ్యక్తి అని కొనియాడారు. విద్య మంత్రిత్వ శాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చిన ఘనత పీవీది అని ఆమె అన్నారు. అంతేకాకుండా… నవోదయ కాన్సెప్ట్ కూడా పీవీదే అని ఆమె వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ వాళ్ల ఆర్థిక స్థితి బాగాలేనప్పుడు పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, మన్మోహన్, పీవీ కాంబినేషన్ వల్లే భారత దేశం గట్టెకిందని ఆమె అన్నారు. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకొని కొత్త ప్రయోగాలకు పూనుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్శించేందుకు ధైర్యంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కానీ అటుంవటి విషయన్ని కూడా మరిచి పోయి మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు. కానీ పార్టీ పీవీ నరసింహారావును గుర్తించలేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీకి నీతీ లేదని ఆమె విమర్శలు గుప్పించారు. కానీ కేసీఆర్ మాత్రం శత జయంతి ఉత్సవాలు చేశారని, ఇంకా పీవీ స్ఫూర్తివంతంగా ఉండేలా చూస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా.. శృంగార తార సంచలన వ్యాఖ్యలు
షెర్లిన్ చోప్రా.. ఈ పేరు వినని వారుండరు. గతేడాది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ఆమె కూడా ఒక నిందితురాలిగా ఉంది. రాజ్ కుంద్రా నిజ స్వరూపాన్ని బయటపెట్టి సోషల్ మీడియాను షేక్ చేసింది. శృంగార వీడియోల్లో నటించాలని రాజ్ కుంద్రా తనను బెదిరించాడని చెప్పుకొచ్చింది. ఇక ఈ కేసు నుంచి ఎలాగోలా బయటపడినచాలా గ్యాప్ తరువాత ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన పౌరాష్‌పూర్- 2 వెబ్ సిరీస్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన షెర్లిన్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాహుల్ గాంధీ అంటే తనకు ఇష్టమని, అతను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పి షాక్ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. “రాహుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒప్పుకొంటే పెళ్లి కూడా చేసుకుంటా.. కానీ, ఒక కండీషన్. నాకు నా ఇంటి పేరును మార్చుకోవడం ఇష్టం లేదు. అది రాహుల్ స్వీకరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటా” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సిరీస్ తరువాత షెర్లిన్ ఎలాంటి సిరీస్ లు చేస్తుంది.. ? ఛాన్స్ లు వస్తాయా.. ? లేవా అనేది తెలియాల్సి ఉంది.