ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. అడిలైడ్ టెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లపై భారీ ప్రభావం చూపింది. భారత్ నుంచి నంబర్-1 టాప్ ప్లేస్‌ను కంగారూలు కొల్లగొట్టారు. ఆస్ట్రేలియా 60.71 శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్స్ పడగొట్టడంతో భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్. 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31) పరుగులు చేశారు. స్టార్క్ ‘ఆరే’యగా..…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో మొదలైన రెండో టెస్టులో భారత్ కుదేలైంది. పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. డే/నైట్ టెస్ట్ మొదటిరోజు తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషబ్ పంత్ (4), రోహిత్ శర్మ (1) ఉన్నారు. యశస్వి జైస్వాల్ (0) గోల్డెన్ డక్ కాగా.. విరాట్ కోహ్లీ (7) పరుగులే చేసి…
తన కోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారని, తాను ఇప్పుడు క్రికెటర్‌గా మారేందుకు ఆయన త్యాగాలే కారణం అని తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఆర్థిక సమస్యల కారణంగా తాము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం అని, ఒక రోజు నాన్న ఏడవడం కూడా చూశానని చెప్పాడు. ఇప్పుడు ఓ కుమారుడిగా నాన్నను సంతోషంగా ఉంచుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నా అని, తన తొలి జెర్సీని ఆయనకే ఇచ్చానని నితీశ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తాచాటిన…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మరికొద్దిసేపట్లో అడిలైడ్ వేదికగా పింక్ బాల్ (డే/నైట్) టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు మార్పులతో బరిలోకి దిగుటున్నట్లు హిట్‌మ్యాన్ చెప్పాడు. తాను, శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నట్లు తెలిపాడు. పెర్త్ టెస్టులో ఆడిన వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌లు పెవిలియన్‌కే పరిమితం అయ్యారు. డే/నైట్ టెస్టులో ఓపెనర్‌గా లోకేష్ రాహుల్ఆడుతున్నడని, తాను…
ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్.. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసి అద్భుత విజయం సాదించిన టీమిండియా.. ఇక రెండో టెస్టుకు సిద్ధమైంది. అయితే అడిలైడ్‌లో గత పర్యటన అనుభవం భారత జట్టుకు హెచ్చరికలు పంపుతోంది. అడిలైడ్ మైదానంలో గత పర్యటనలో ఆడిన టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అందుకోలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో టెస్ట్ ఆరంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే ఈ డే/నైట్ టెస్టులో టీమిండియా ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్. అదే ఊపులో రెండో టెస్టులో గెలవాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై ఆడుతోన్న ఆస్ట్రేలియా.. పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. పింక్ బాల్ టెస్టులో మంచి రికార్డు ఉన్న ఆసీస్.. టీమిండియాను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే, జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ పడగొట్టగా.. భారత్ 295 రన్స్ తేడాతో గెలిచింది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా పింక్ బాల్‌తో డే/నైట్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలుకాబోతోంది. అయితే ఆస్ట్రేలియాలో మ్యాచ్, అదీనూ పింక్ బాల్ టెస్ట్ కాబట్టి.. మ్యాచ్ టైమ్,…
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు. క్లార్క్ తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొనగా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టాప్ స్కోరర్ ఎవరన్న ప్రశ్నకు విరాట్ పేరు చెప్పాడు. ‘పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయిన విషయం పక్కన పెడితే.. కోహ్లీ మొదటి గేమ్‌లో సెంచరీ చేయడం నన్ను చాలా భయపెడుతోంది. ఈ సిరీస్‌లో విరాట్ భారీగా పరుగులు చేస్తాడు.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. అడిలైడ్ కోసం సిద్దమైంది. డే/నైట్ మ్యాచ్‌గా జరిగే ఈ పింక్ బాల్ టెస్టులో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అందుబాటులోకి రావడంతో.. దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.…