డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గాయపడటం జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో స్మిత్ గాయపడ్డాడు. నెట్స్‌లో మార్నస్ లబుషేన్ వేసిన త్రో పడుతుండగా అతని వేలికి గాయమైంది.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆటగాడు ఆశిశ్ నెహ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా ఐపీఎల్ వేలంలోకి వస్తే.. అద్భుతమే జరిగేదని, ప్రాంచైజీలకు రూ.520 కోట్ల పర్స్ ఉన్నా సరిపోదన్నాడు. అతడిని ఓడించడం ఎవరి వల్ల కాదని నెహ్రా చెప్పుకొచ్చాడు. 2013 నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి ఆడుతున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ 11 ఏళ్లలో ముంబై ఒక్కసారి కూడా బుమ్రాను వేలంలోకి విడిచిపెట్టలేదు. అంటే అతడికి ఎంత…
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశపర్చిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల్లో 93 పరుగులే చేసి విమర్శల పాలయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ ఫామ్‌లోకి వస్తాడని మాజీలు ధీమా వ్యక్తం చేశారు. అన్నట్టుగానే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదేశాడు. కోహ్లీ శతకం బాధగానే ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు. విరాట్ కూడా స్టేడియంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫామ్‌లోకి వచ్చిన విరాట్ పలు…
భారత జట్టుకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ప్రస్తుతం అడిలైడ్‌లో ఉన్న భారత జట్టుతో కలిశాడు. టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధతను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదే సమయంలో రెండో టెస్టు తుది జట్టుపై ప్రణాళికలు మొదలు పెట్టాడు. యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఎవరిని ఓపెనర్‌గా పంపాలని మల్లగుల్లాలు పడుతున్నాడు. అయితే ఈ విషయంలో ఇప్పటికే గంభీర్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్టు ముగిసాక…
Rohit Sharma: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు భారత క్రికెట్ జట్టు పూర్తిగా సన్నద్ధం అవుతోంది. జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ లీడ్ చేయబోతున్నాడు. మొదటి టెస్టులో కెప్టెన్‌గా రోహిత్ గైర్హాజరీతో జస్ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టాడు. అతను భారత్‌ను విజయపథంలో నడిపించాడు. ఇప్పుడు రోహిత్ శర్మకు పరీక్ష ఉండనుంది. ఎందుకంటే, తన కెప్టెన్సీలో టీమిండియాను గెలిపించడమే కాకుండా.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు చేయలేని పనిని చేయాలన్నది రోహిత్ శర్మ ముందున్న సవాల్. Also Read: IPL…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భారత్ శుభారంభం చేసింది. బౌలర్లతో పాటు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో చెలరేగారు. సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లో విరాట్ మొదటి టెస్టులోనే ఫామ్ అందుకోవడంతో.. టీమిండియా ఫాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ తమ జట్టు వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ పెర్త్ టెస్ట్ ముందు వరకు పెద్దగా రన్స్ చేయలేదని, అతడిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి కట్టడి చేసేందుకు ఆసీస్…
అడిలైడ్ టెస్టుకు ముందే టీమిండియాకు షాక్ తగిలేలా ఉంది. పింక్ బాల్ మ్యాచ్‌కు భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఆడటం కష్టమే అనిపిస్తుంది. గిల్ బొటనవేలు గాయం నుండి ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో.. నవంబర్ 30 నుండి కాన్‌బెర్రాలో ప్రారంభమయ్యే ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు.