Gautam Adani: అదానీ గ్రూప్‌తో పాటు తనపై అమెరికా మోపిన ఆరోపణలపై తొలిసాగారి అదానీ గ్రూప్ చూర్మన్ గౌతమ్ అదానీ ఈ రోజు స్పందించారు. ‘‘ రెండు వారాల క్రితం అదానీ గ్రూప్‌పై అమెరికా ఆరోపణలు ఎదుర్కొన్నాము. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. ప్రతీ దాడి మమ్మల్ని మరింత బలపరుస్తుందని మీకు చెప్పగలను.
Adani Group: అదానీ గ్రూప్స్ తో పాటు దాని అనుబంధ కంపెనీలు.. ఒప్పందాల్లో భాగంగా భారత ప్రభుత్వ అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై ఆమెరికాలో కేసు నమోదైంది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్‌కు చెందిన గ్రీన్ ఎనర్జీ ఈరోజు (బుధవారం) రియాక్ట్ అయింది.
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ భారీ ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల్లో భాగంగా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని సోమవారం తెలిపింది. గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. అవినీతి విచారణ గురించి తమకు తెలియదని ఇంధన సంస్థ పేర్కొంది. బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో టోటల్ ఎనర్జీస్ ఒకటి.
వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అదానీ లంచం కేసు మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుందన్నారు. ఇక, భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంభాషణలను బయటపెట్టిన వ్యక్తికి ప్రాణహాని ఉంది. ఈ వ్యక్తి పేరు నెల్సన్ అమేన్యా. విమానాశ్రయానికి సంబంధించి అదానీకి, కెన్యా ప్రభుత్వానికి మధ్య జరిగిన రహస్య సంభాషణను ఈ వ్యక్తి బయటపెట్టారు. అమేన్యా ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత చాలా కలకలం రేగింది. ఈ బహిర్గతం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అమేన్యా అన్నారు. కెన్యా ప్రభుత్వం నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తాను ఇప్పుడు భయపడుతున్నానని…
Adani : గౌతమ్ అదానీ హిండెన్‌బర్గ్ భూతం నుంచి బయటపడ్డాడని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్‌లపై అమెరికాకు చెందిన ఓ పరిశోధనా సంస్థ మరో బాంబు పేల్చింది.
Hindenburg Research Report: మరోసారి అదానీ గ్రూప్‌కు సోమవారం చీకటి రోజుగా మారవచ్చు. వారాంతంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కొత్త నివేదిక తర్వాత సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనం జరిగింది.
Gautam Adani Retirement: దేశంలో బడా పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, వంటనూనెల తయారీ, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ వెలికితీత..వంటి ఎన్నో రంగాల్లో ఆయన వ్యాపారం నిర్వహిస్తున్నారు.