Supreme Court: భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ గ్రూప్‌ని లక్ష్యం చేసుకుంటూ హిండెన్ బర్గ్ రిపోర్టు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు కారణంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వ్యవహారం ఇటు వ్యాపారపరంగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేశాయి.
Sri lanka: ఇండియా మిత్రదేశం శ్రీ లంకలో నానాటికి పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుక భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు తీసుకున్న చైనా అక్కడి నుంచి భారత్‌తో పాటు ఇండో-పసిఫిక్ రీజియన్‌లో నిఘా పెంచుతోంది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాతో జట్టు కట్టింది.
Rahul Gandhi: అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పెద్ద ఆరోపణ చేశారు. బొగ్గు వ్యాపారంలో గౌతమ్ అదానీ పెద్ద తప్పులు చేశారని రాహుల్ అన్నారు.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి ఆమె ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
OCCRP Allegations on Adani Group : అదానీ గ్రూప్ పై మరోసారి పిడుగుపడింది. మళ్లీ ఆ సంస్థపై అక్రమ పెట్టుబడులు ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈసారి ఈ ఆరోపణలు చేసింది ఆర్గనైజ్‌డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్‌పీ). అదానీ గ్రూప్ కంపెనీల్లో అజ్ఞాత విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలు చేస్తోంది. యాక్టివ్ గా లేని మారిషస్ ఫండ్స్ ద్వారా కోట్లాది డాలర్లను గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా…
Dharavi Project: ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు ఎలాంటి అనవసర ప్రయోజనం చేకూర్చలేదని హైకోర్టులో పేర్కొంది.
Jio Financials: ముఖేష్ అంబానీకి సోమవారం చాలా ప్రత్యేకం. అతని కొత్త కంపెనీ జియో ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. మార్కెట్‌లో లిస్టింగ్ కూడా అంచనాల ప్రకారమే జరిగినా ఫలితం లేకపోయింది.
Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వచ్చి దాదాపు 8 నెలలు కావస్తున్నా దాని ప్రభావం కూడా మెల్లగా కనిపిస్తోంది. జూన్ త్రైమాసికంలో గ్రూప్ 70 శాతం లాభాన్ని సాధించింది. పోర్ట్, పవర్, గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో ఈ మూడు నెలల్లో చాలా మంచి పనితీరు కనిపించింది.
Adani Group: హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌కు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. అదానీ గ్రూప్‌పై పెట్టుబడిదారుల విశ్వాసం అలాగే ఉందని దీంతో నిరూపితం అవుతోంది. దీంతో వారు అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
ప్రముఖ బిలినీయర్, దేశంలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానిపై ప్రముఖ అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై విచారణకు కొన్ని కమిటీలు కూడా వేశారు. సెబీ వీటిపై పూర్తి ఆధారాలతో నివేదికలు సమర్పించనుంది. ఆగస్టు 15 నాటికే వీటికి సంబంధించి పూర్తి నివేదికను సెబీ సుప్రీంకోర్టుకు అందిచాల్సి ఉండగా ఇంకా కొన్ని విషయాలను పరిశీలించడానికి మరికొంత సమయం కావాలని సెబీ కోరింది.…