మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక గత రెండు రోజులుగా ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగాడని, ఈ సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని వార్తలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. ఈ వార్త నిజమైతే బావుండు అని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు చిరు.. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తాజాగా చిరు.. ఆచార్య సినిమాకు తన గాత్రాన్ని అందజేసిన మహేష్ కు ట్విట్టర్ వేదికగా థాంక్స్ చెప్పారు. ” ప్రియమైన మహేష్ ఆచార్యలో మీ మనోహరమైన స్వరంలో ‘పాదఘట్టం’ని పరిచయం చేసినందుకు ఆనందంగా ఉంది. చాలా ప్రత్యేకమైన రీతిలోఈ సినిమాలో భాగమైనందుకు ధన్యవాదాలు!! అభిమానులు & ప్రేక్షకులు మీ మాట వినడానికి అంతే థ్రిల్ అవుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దాన్ని చూడడానికి నేను, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడుతున్నాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఏ ఈచిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. ఇక ఇన్ని స్పెషల్స్ ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే మరో వారం ఆగాల్సిందే.
Dearest @urstrulyMahesh Delighted to have you introduce ‘Padaghattam’ in your endearing voice in #Acharya
Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!
— Acharya (@KChiruTweets) April 22, 2022