మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RC15’ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ RC15లో రామ్ చరణ్ సరసన కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు RC15 చిత్రానికి స్క్రిప్ట్ అందించగా, సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ పంజాబ్ లోని అమృత్ సర్ లో జరుగుతోంది. ఈ మేరకు పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా RC15 టీం అమృత్ సర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఇక అక్కడ షూటింగ్ ను పూర్తి చేసుకున్న చరణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చెర్రీ ఒక పిక్ ను కూడా షేర్ చేశారు.
Read Also : Ghani : ‘ఆహా’లో ప్రొడ్యూసర్స్ కట్ వెర్షన్… వర్కౌట్ అవుతుందా ?
అందులో “అమృత్‌సర్ లో షెడ్యూల్ పూర్తయింది. ఆచార్య ప్రమోషన్స్ కోసం తిరిగి హైదరాబాద్ కు !!!” అంటూ తన కుక్క రైమ్ తో ఫ్లైట్ లో ఉన్న పిక్ ను షేర్ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే త్వరలోనే యాక్షన్ డ్రామా ‘ఆచార్య’ ప్రమోషన్స్ జోరందుకోబోతున్నాయని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ‘ఆచార్య’లో మొట్టమొదటిసారిగా చిరు, చరణ్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోబోతున్నారు. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ‘ఆచార్య’ పాటలకు కూడా మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.