అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జవాన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను, అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం నా అదృష్టం. మనం ఇక్కడ ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నామంటే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, దేశ సైనికుల త్యాగాలే దానికి కారణం. దేశ సైనికుల ధైర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం నడిచే నేల, పీల్చే గాలీ, బతుకుతున్న దేశం మీద వీర జవాన్ల చెరగని సంతకం ఉంటుంది. వీరుల త్యాగాలను ఎవరు మరిచిపోవద్దు. దేశం ప్రశాంతంగా ఉందంటే అది మన సైనికుల వలనే” అంటూ యూత్ లో స్ఫూర్తినింపే వ్యాఖ్యలు చేశారు రామ్ చరణ్.
Read Also : Gowtam Tinnanuri : తెలుగు దర్శకుడికి బీటౌన్ ఫిదా… స్టాండింగ్ ఒవేషన్
ఇక ఈ సందర్భంగా తాను జవాన్ గా నటించిన సినిమాను కూడా గుర్తు చేసుకున్నారు. “ధృవ సినిమాలో ఆర్మీ జవాన్ పాత్ర పోషించడం గర్వంగా ఉంది’ అని అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ “RC15” షూటింగ్ లో ఉన్నారు. మరోవైపు తండ్రి చిరుతో కలిసి చెర్రీ నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధం అవుతోంది.