NTR 30 : అలియాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్… స్టోరీ ఇదేనట !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“జనతా గ్యారేజ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల, ఎన్టీఆర్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. తారక్ ఫ్యాన్స్ దృష్టి అంతా
ఇప్పుడు NTR 30 పైనే. ‘ఎన్టీఆర్ 30’ ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. అయితే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో “ఎన్టీఆర్30” హీరోయిన్, స్టోరీ మొదలైన విషయాలను వెల్లడించారు.
Read Also : Koratala Siva : లైన్ లో మరో ఇద్దరు స్టార్ హీరోలు!
Also Read
కొరటాల మాట్లాడుతూ “ఎన్టీఆర్‌తో నా గత చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. మేము రెండవ ప్రాజెక్ట్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాము. స్క్రిప్ట్ చాలా వరకు పూర్తయింది. ఈ మూవీ ఎమోషనల్ అండ్ పవర్ ఫుల్ గా ఉండబోతోంది. ఎన్టీఆర్ ను ఇంతకుముందెన్నడూ చూడని పవర్ ఫుల్ రోల్ లో చూడబోతున్నారు. ప్రస్తుతం సినిమా గురించి ఎక్కువ విషయాలు చెప్పదలచుకోలేదు. నేను ‘ఆచార్య’ పూర్తి చేసిన తర్వాత ఒక చిన్న విరామం తీసుకుని మేలో ఎన్టీఆర్‌తో ప్రిపరేషన్ ప్రారంభిస్తాను. మే 28వ మేము నటీనటులు, సిబ్బందిని ప్రకటిస్తాము. షూటింగ్ జూన్ లో ప్రారంభం అవుతుంది. భారీ సెట్ లో ఈ మూవీ రూపొందనుంది”అని తెలిపారు.
ఇక “ఎన్టీఆర్ 30” పాన్ ఇండియానా ? అనే ప్రశ్నకు సమాధానంగా “నేను పాన్-ఇండియా లేదా పాన్-సౌత్‌ను నమ్మను. కానీ స్క్రిప్ట్ కు అవసరమైతే చేస్తాము” అని తెలిపారు. ఇక అలియా భట్ గురించి విన్పిస్తున్న రూమర్ల గురించి స్పందిస్తూ “ఇంకా హీరోయిన్ విషయం ఖరారు కాలేదు. అలియా గురించి చాలా రూమర్లు వచ్చాయి. కానీ నిజానికి నేను నా స్క్రిప్ట్‌ని పూర్తి చేసి ఎన్టీఆర్‌కి చెప్పడం మాత్రమే జరిగింది. నేను ‘ఆచార్య’ను పూర్తి చేశాక చిన్న విరామం తీసుకుని మిగతా విషయాలను ఖరారు చేస్తాము” అని శివ వెల్లడించాడు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!