Physical Harassment: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లిలో ఓ మైనర్ బాలికపై రెండేళ్లుగా వేర్వేరుగా 14 మంది కామాంధులు అత్యాచారం చేసిన ఘటనల తీవ్ర కలకలంరేపుతోంది.. అయితే, ఈ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది.. గతంలోనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా, మరో ఏడుగురు నిందితులు అరెస్ట్ చేసిన రామగిరి పోలీసులు.. పుట్టపర్తిలో జిల్లా ఎస్పీ ఎదుట నిందితులను హాజరుపరిచారు..
Read Also: Medak: సహజీవనం చేస్తూ దొంగతనాలు.. లవర్స్ ని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వీ రత్న మాట్లాడుతూ.. మైనర్ బాలిక అత్యాచారం కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నాం అన్నారు.. ప్రభుత్వానికి ఆపాదిస్తూ కొన్ని మీడియాలు తప్పుడు కథనాలు రాయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.. జిల్లాలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. జిల్లాలో పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా క్రైమ్ రేట్ 31 శాతం తగ్గినట్టు వెల్లడించారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వీ రత్న..
Read Also: Trivikram: పాపం.. కన్ఫ్యూజన్లో త్రివిక్రమ్!
కాగా, మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి ఒడిగట్టారు కామాంధులు.. రెండేళ్లుగా బాలిక శరీంపై దాడులు చేస్తూ.. అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేశారు.. ఇక, రెండేళ్లు మౌనంగా ఆ కామాంధుల శారీరక, మానసిక హింసను భరిస్తూ వచ్చిన ఆ బాలక.. తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చినట్టు అయ్యింది.. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో మైనర్ బాలికపై గత రెండేళ్లుగా వేర్వేరుగా.. పలుమార్లు అత్యాచారం చేశారు కామాంధులు.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ బలవంతంగా టచ్ చేస్తూ.. శరీరంపై దాడులు చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తూ.. పైశాచిక ఆనందం పొందారులు.. అయితే, మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామగిరి పోలీసులు. ఈ అత్యాచార కేసును ఛేదించారు.. అందులో ఆరుగురిని అరెస్ట్ చేశారు.. ఇక, తాజాగా, మరో ఏడుగురిని అరెస్ట్ చేయడంతో.. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినవారి సంఖ్య 13కు చేరింది..