బీహార్‌లోని సివాన్, సరన్, గోపాల్‌గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు సంచలనం సృష్టించింది.. వలస వచ్చిన ఓ ఫ్యామిలీపై దాడి చేసిన దుండగులు.. అర్ధరాత్రి సమయంలో అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేపు చేసిన ఘటన కలకలం సృష్టించగా.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. ఘటన జరిగిన 48 గంటల్లోగా నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ కేసుపై మీడియాతో మాట్లాడిన ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. సత్యసాయి జిల్లాల్లో అత్తా…
బెజవాడలో కలకలం రేపిన రైల్వే లోకో పైలట్ హత్య కేసును ఛేదించారు పోలీసులు.. రెండు రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలోనే లోకో పైలట్ ఏబేలు దారుణ హత్యకు గురవటం తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే.. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.. అయితే, హత్యకు పాల్పడిన వ్యక్తిని సీసీ టీవీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించటంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు.
బెంగళూరులో రిఫ్రిజిరేటర్‌లో ముక్కలు ముక్కలుగా నరికి మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడి నుండి పోలీసులు డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను ఆత్మరక్షణ కోసం చంపినట్లు రాశాడని తెలిపారు. బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో మహాలక్ష్మి మృతదేహాన్ని 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు నిందితుడు ముక్తి రంజన్ రాయ్.. కాగా.. హత్య అనంతరం సెప్టెంబర్ 25 న ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర పన్నిన కేసులో పెద్ద సంచలనం చోటుచేసుకుంది. ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లవ్ జిహాద్ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు తమ నిజస్వరూపాన్ని దాచిపెట్టి, సోషల్ మీడియాలో అమ్మాయిలను ట్రాప్ చేసి, తమ కామప్రాయానికి బలిపశువులను చేసేవారు.
గత కొద్ది రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో నిందితుల ఇళ్లపై బుల్డోజర్లతో ఆస్తులను ధ్వంసం చేసే చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. సోమవారం ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బుల్డోజర్ చర్యలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది.
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు.
కోల్‌కతా మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును శుక్రవారం సీల్దా కోర్టులో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో.. నిందితుడు సంజయ్ రాయ్ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే.