కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై పశ్చిమబెంగాల్‌లోని సీల్దా కోర్టు అభియోగాలు మోపింది. సంజయ్ రాయ్‌పై భారతీయ న్యాయ్ సహిత 103(1) లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. (హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష లేదా జీవితాంతం జైలు శిక్ష విధించబడుతుంది మరియు జరిమానా కూడా విధించబడుతుంది.), 64 (అత్యాచారం కోసం శిక్ష) మరియు 66 (మరణానికి కారణమైనందుకు శిక్ష). కింద అభియోగాలు మోపబడ్డాయి. నవంబర్ 11 నుంచి విచారణ ప్రారంభం కానుంది.
ఇది కూడా చదవండి: Citroen Aircross Xplorer: సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ఇండియాలో రిలీజ్.. వివరాలివే..!
ఇదిలా ఉంటే ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం ఆగస్టు 10న సివిల్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపట్టారు. అనంతరం ఈ కేసును కోల్‌కతా హైకోర్టు.. సీబీఐకి అప్పగించింది. ఇక దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ కేసులో సంజయ్ రాయ్‌నే ప్రధాన నిందితుడిగా సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. అతడు ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొంది. అలాగే అప్పటి తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి అభిజిత్ మోండల్, ఆర్‌జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఈ ఘటనను దాచిపెట్టడానికి ప్రయత్నించారని, సాక్ష్యాలను నాశనం చేశారని వారిపై కూడా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇద్దరిని దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే బాధితురాలికి న్యాయం చేయాలని, అలాగే ఆస్పత్రుల్లో భద్రతా కల్పించాలని జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం.. డాక్టర్లను చర్చలకు పిలిచింది. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వైద్యులు విధుల్లో చేరారు.
ఇది కూడా చదవండి: Air force plane crashes: కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.. పోలాల్లో పడి బూడిదైన జెట్..
#WATCH | RG Kar rape and murder case | West Bengal's Sealdah Court framed charges against accused Sanjay Roy under section 103(1), 64 and 66 Bhartiya Nyay Sahita. The trial will begin on November 11, 2024.
(Visuals of him being taken from the Court) pic.twitter.com/EXPHZ8DpjV
— ANI (@ANI) November 4, 2024