2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఫిబ్రవరి 2020 అల్లర్ల కేసులో బెయిల్ నిరాకరిస్తూ సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారించిన సుప్రీం ధర్మాసనం కూడా నిందితులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Trump: చెప్పినట్లు వినకపోతే నీకు అదే గతి.. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ వార్నింగ్
2020లో పౌరసత్వం (సవరణ) చట్టం (CAA) కు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. రోజుల తరబడి ఉద్రిక్తలు నడిచాయి. ఈ కేసులో ఉమర్ ఖలీద్‌ను అదుపులోకి తీసుకుని సెప్టెంబర్ 13, 2020 నుంచి కస్టడీలో ఉంచారు. ఇక ఇమామ్‌ను జనవరి 28, 2020 నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ అల్లర్లు చెలరేగడానికి కొన్ని వారాల ముందు నుంచే జైల్లో ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఇంకా ఎవరైనా చనిపోతే ఖబడ్దార్.. ఖమేనీకి ట్రంప్ గట్టి వార్నింగ్
ఫిబ్రవరి 2020లో ఈశాన్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. చాలా రోజులు కొనసాగిన ఈ హింసకు అనేక మంది మరణాలకు దారితీసింది. ఇళ్ళు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అయితే పరిపాలనను అస్థిరపరిచేందుకు నిందితులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. పాలన మార్పుతో పాటు దేశమంతటా కుట్రకు పాల్పడినట్లుగా పోలీసులు ఆరోపించారు. UAPA లోని సెక్షన్ 43D(5) కింద కేసులు నమోదు చేశారు.
అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మహ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్ అనే మరో ఐదుగురికి మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అయితే ఖలీద్, ఇమామ్‌లకు మాత్రం నిరాకరించింది.
ఇక న్యూయార్క్ నగరానికి కొత్త మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జోహ్రాన్ మమ్దానీ ఇటీవల ఉమర్ ఖలీద్‌కు లేఖ రాశారు. లేఖలో జైలులో ఉన్న విద్యార్థి నాయకుడి తీవ్ర భావాల గురించి తాను తరచుగా ఆలోచిస్తానని పేర్కొన్నారు. ‘‘డియర్ ఉమర్’’ అని సంబోధించారు. ఈ లేఖ 2025 డిసెంబర్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ఖలీద్ తల్లిదండ్రులకు అందజేశారు.