తిరుమల ఘాట్ రోడ్డు పై ఈ మధ్య వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు.. ఇక తాజాగా ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ టెంపో వాహనం తిరుమల నుంచి మొదటి ఘాట్ రోడ్ ద్వారా తిరుపతికి వస్తుండగా ఆరో మలుపు వద్ద రెయిలింగ్ వాల్ ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటన లో 12 మందికి గాయాలయ్యాయి. వారిని కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన భక్తులుగా గుర్తించారు. క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్…
Expressway: ఆరు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయింది.
రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తాయంటే షెడ్యూలింగ్‌లో అనూహ్యమైన మార్పులు చేర్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సిగ్నలింగ్ సమస్యలు, అనుకోని అంతరాయాలు.. ఇలా పలు కారణాలు చెప్పొచ్చు. అయితే పశువుల వల్ల కూడా రోజుకి సగటున 11 రైళ్లు లేట్‌గా రాకపోకలు సాగిస్తున్నాయని రైల్వే శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల రైల్వేలకు భారీగా నష్టాలొస్తున్నాయి. మేత కోసం పశువులు రైల్వే ట్రాక్‌ల మీదికి వస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. అదే సమయంలో రైళ్లకు ఆటంకం…
సాధారణంగా ఆర్టీసీ బస్సు ముందు భాగంలో ఐదు అడుగుల ఎత్తు వరకూ ఏమీ కనిపించదు. కొన్నిసార్లు ప్రయాణికులు, పాదచారులు బస్సు ముందు నుంచి వెళ్తుంటే.. ఎవరూ లేరని భావించి డ్రైవర్లు బస్సును ముందుకు పోనిస్తుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో రావులపాలెం బస్టాండ్‌లోనే ఇదే తరహాలో రెండు ప్రమాదాలు జరగడంతో ఆయా బస్సులను నడిపిన డ్రైవర్లు ఆరు నెలల పాటు సస్పెండయ్యారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఆర్టీసీ పరిహారం…
ఈ మధ్య కాలంలో తెలంగాణలో ముఖ్యమంగా హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామో… లేదో… అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అయితే రోడ్డు మీద ప్రయాణం దైవాధీనంగా మారిందని పేర్కొన్నారు. ఫుల్లుగా తాగి ఓవర్ స్పీడుగా వాహనాలు నడిపే కొందరు వ్యక్తుల వల్ల…గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం…
మద్యం మత్తులో తూగుతూ వాహనాల నడిపి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. జల్సాల కోసం మద్యం సేవించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వీఐపీ జోన్ అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, అపోలో బస్ స్టాప్, క్యాన్సర్ హాస్పిటల్ తో పాటు తదితర చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. దీంతో మంగళవారం రాత్రి ట్రాఫిక్ జామ్ అయ్యింది.…