మద్యం మత్తులో తూగుతూ వాహనాల నడిపి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. జల్సాల కోసం మద్యం సేవించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వీఐపీ జోన్ అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, అపోలో బస్ స్టాప్, క్యాన్సర్ హాస్పిటల్ తో పాటు తదితర చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
దీంతో మంగళవారం రాత్రి ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరుస ప్రమాదాల దృష్ట్యా తనిఖీలు చేపడుతున్నామని, ఇకనుంచి రెగ్యులర్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.