ఈ మధ్య కాలంలో తెలంగాణలో ముఖ్యమంగా హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామో… లేదో… అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అయితే రోడ్డు మీద ప్రయాణం దైవాధీనంగా మారిందని పేర్కొన్నారు. ఫుల్లుగా తాగి ఓవర్ స్పీడుగా వాహనాలు నడిపే కొందరు వ్యక్తుల వల్ల…గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాల పట్ల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవాల్సిన పనిలేదన్నారు.
”ఇక నిబంధనలు ఉల్లంఘించే పబ్‌లపై చర్యలు ఇంకెంత గొప్పగా ఉన్నాయనేది చెప్పుకోవాల్సిన పనిలేదు. హైదరాబాద్ విశ్వనగరమని… ఏదేదో చేసేస్తామని…జైల్లో ఉండి బెయిల్ తీసుకుని బయట తిరుగుతుండటం బాధిత కుటుంబాల్లో వేదన రెట్టింపు చేస్తోంది. ఇదిలా ఉంటే నిందితుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు విషయంలో రవాణాశాఖ తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.” అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.