Accident: జమ్మూలో ఘోర ప్రమాదం..150 అడుగుల లోయలోకి బస్సు.. 16 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా.. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. యాత్రికులతో నిండిన బస్సు యూపీలోని హత్రాస్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శివ్ ఖోడికి వెళుతోంది. చోకి చోరా ప్రాంతంలోని తంగ్లీ మలుపు వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. బస్సు 150 అడుగుల లోయలో పడింది. అయితే బస్సుకు ఎదురుగా ఏదైనా వాహనం వచ్చిందా లేదా మరేదైనా కారణం ఉందా అనేది ఇంకా తెలియరాలేదు.
READ MORE: Temperature Rise: ఎప్పుడూ లేని విధంగా భారతీయ నగరాలపై భానుడి ప్రతాపం.. కారణం ఏమిటి..?
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
రాజౌరి జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ప్రజల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. క్షతగాత్రులను జమ్మూలోని అఖ్నూర్ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. బస్సు ఒక్కసారిగా లోయలో పడటంతో ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల ప్రజలు గమనించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ట్వీట్ చేస్తూ చేశారు. ” జమ్మూ సమీపంలోని అఖ్నూర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.” అని రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!