యాంకర్ సుమ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోంది. ఇటీవలే ఆమె ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి మొత్తం సుమ సుపరిచితురాలు కాబట్టి స్టార్ హీరోలు సైతం ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఇక ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా సుమ ప్రమోషన్స్ ఆపలేదు. ఈ సినిమా షూటింగ్ లో ఆమె ప్రమాదానికి గురైన వీడియో ను షేర్ చేస్తూ జయమ్మ కోసం కోసం తాము పడ్డ కష్టాన్ని తెలియజేసింది.
ఇక ఆ వీడియోలో ఒక కొండ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా.. అక్కడే ఉన్న రాళ్లను పట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంది సుమ.. అప్పుడే నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో ఆమె కాలు ఒక్కసారిగా జారడంతో కిందపడబోయింది. ఇంతలోనే రాయిని గట్టిగా పట్టుకొని తనను తాను అదుపుచేసుకోవడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది . వెంటనే చిత్ర యూనిట్ సుమను గట్టిగా పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు. ఇక ఈ వీడియో షేర్ చేస్తూ సుమ.. తృటిలో తప్పిన ప్రమాదం అన్నట్లుగా క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జాగ్రత్తగా ఉండాలి కదా సుమ.. చూసుకోవాలి కదా .. అని కొందరు . దేవుడా పెద్ద ప్రమాదం తప్పింది అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.