Jubileehills Road Accident: ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45లో జరిగిన ప్రమాదం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలో మహిళ పడేయడంతోనే చిన్నారి చనిపోయిందంటున్నారు ఎమ్మెల్యే షకీల్. జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ ఈ విధంగా స్పందించారు. ప్రమాదం జరిగిన తర్వాతే ఆ మహిళే పాపను కింద పడేసిందని, ఆమె పడేయడంతోనే చిన్నారి చనిపోయిందని షకీల్ తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాలని మీర్జా ఫ్యామిలీకి చెప్పానని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘గురువారం యాక్సిడెంట్ జరిగిన కారు నా కజిన్‌ది. ఆ కారు నేను కూడా అప్పుడప్పుడు వాడతాను. అందుకే ఆ కారుకు నా స్టిక్కర్ అంటించారు. ప్రమాదం ఘటన తెలియగానే నా కజిన్ మీర్జాతో మాట్లాడాను. కారు నడిపింది నా కజిన్ మీర్జా కొడుకు’’ అని షకీల్ తెలిపారు.
జూబ్లీహిల్స్‌లో నిన్న ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండున్నర నెలల పసికందు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరిట స్టిక్కర్ ఉంది. రాత్రి 10 గంటల సమయంలో దుర్గం చెరువు తీగల వంతెన వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1 వైపు మహీంద్రా థార్ కారు వెళుతోంది. తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో వంతెన దిగి కొంతదూరం వచ్చిన తర్వాత రోడ్డు దాటుతున్న ముగ్గురు యాచక మహిళలను కారు ఢీకొంది. రెండున్నర నెలల బాబు కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు మహిళలకూ గాయాలయ్యాయి. కారును నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన మహిళలతోపాటు చిన్నారి మృతదేహాన్ని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరంతా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆ మహిళలను మహారాష్ట్రకు చెందిన కాజల్‌చౌహాన్, సారికచౌహాన్, సుష్మ భోంస్లేగా, మృతిచెందిన చిన్నారిని రణవీర్ చౌహాన్‌గా గుర్తించారు. ఈ ఘటన బాధాకరం అన్నారు ఎమ్మెల్యే షకీల్. గాయపడ్డ మహిళ కాజల్ చౌహాన్ నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదంపై విమర్శలు వస్తున్న వేళ ఎమ్మెల్యే షకీల్ స్పందించి వివరణ ఇచ్చారు.
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
- CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?