Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ లో గాయపడ్డారు. ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం టైగర్ 3. ఈ చిత్ర షూటింగులో పాల్గొంటుండగా సల్మాన్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడట. సల్మాన్ ఖాన్ మీద ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా తన ఎడమ భుజానికి గాయమైందని సల్మాన్ పేర్కొన్నారు.
మెక్సికోలో జరిగిన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్యాసింజర్ వ్యాన్, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 26 మంది మరణించినట్లు ఉత్తర సరిహద్దు తమౌలిపాస్ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికిపైగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని దల్పత్‌పూర్-కాశీపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువులతో పెళ్లికి వెళుతున్న వ్యాన్‌ను వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది.
Prone Zones: తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలమో, వర్షాకాలమో చెప్పలేం. అకాల వర్షాల కారణంగా రెండు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఈ అకాల వర్షాల్లే రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చిన పంటలు, ఐకేపీ కేంద్రాలకు తరలించిన వరి ధాన్యం కుప్పలు, కల్లాల్లో ఆరబెట్టిన పంటలన్నీ నీటిపాలైంది.
మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ మెక్సికోలో బస్సు కొండపై నుండి పడిపోవడంతో కనీసం 18 మంది మరణించారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు.
Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె-బెంగళూరు హైవేపై ప్రైవేట్ బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, 22 మంది గాయపడ్డారు.
Viral : డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పొగొట్టుకునే ప్రమాదం ఉంది. కుటుంబాలు రోడ్డున పడుతాయి. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమైన ఘటనలు కోకొల్లలు. అందుకే ప్రభుత్వాలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ఎంత హెచ్చరించినా కొందరు మారడంలేదు.
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.