Viral : డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పొగొట్టుకునే ప్రమాదం ఉంది. కుటుంబాలు రోడ్డున పడుతాయి. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమైన ఘటనలు కోకొల్లలు. అందుకే ప్రభుత్వాలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ఎంత హెచ్చరించినా కొందరు మారడంలేదు. ఇలాగే ఓ మహిళ రైలు నడుపుతూ మొబైల్ ఫోన్ ను ఉపయోగించడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ లో ఆమె నిమగ్నవడంతో ఆ రైలు మరో రైలును ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విటర్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కెమెరాకు చిక్కిన వ్యక్తుల వీడియోలను పోస్ట్ చేసే ట్విట్టర్ పేజీ ఈ ఘటనను కూడా విడుదల చేసింది. ఈ ప్రమాదం 2019 అక్టోబర్ నెలలో రష్యా దేశంలో చోటు చేసుకుంది.
Read Also : Chhattisgarh : కోడిగుడ్ల కోసం హోటల్ ఓనర్ కిడ్నాప్
ఆ వీడియోలో ఓ మహిళా లోకో పైలెట్ రైలు నడుపుతూ ఉంటుంది. ఆ సమయంలోనే తన ఫోన్ చూస్తూ దాంట్లోనే మునిగిపోతుంది. ఎదురుగా రైలు వస్తున్న సంగతి కూడా మరిచిపోయింది. తీరా ట్రైన్ దగ్గర రాగానే ఒక్క సారిగా ఆమె ఫోన్ కింద పడేసి ట్రైన్ కంట్రోల్ చేసేందుకు బ్రేక్ వేయడానికి ప్రయత్నించింది. కానీ ఆలోపే రెండు రెళ్లు ఢీకొన్నాయి. ఆ సందర్భంలో ఆమె సీటు బెల్టు ధరించడం వల్ల గాయాలు కాలేదు. కానీ లోపల ఉన్న ఓ ప్రయాణికుడు ఆకస్మికంగా సంభవించిన ఈ ప్రమాదం వల్ల ముందుకు వెళ్లిపడ్డాడు. ‘స్మార్ట్ ఫోన్ వాడుతూ రైలు నడపడం’ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. పోస్టు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ వీడియోకు 10.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
Read Also: IPL 2023: IPL 2023: సీఎస్కేతో కోల్‌కతా బిగ్ ఫైట్.. ఉత్కంఠ పోరులో గెలిచేది ఎవరు?
driving a train while on a smartphone pic.twitter.com/CZA23skxdv
— CCTV IDIOTS (@cctvidiots) April 20, 2023