Mexico Crash: మెక్సికోలో జరిగిన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్యాసింజర్ వ్యాన్, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 26 మంది మరణించినట్లు ఉత్తర సరిహద్దు తమౌలిపాస్ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. పరిమితికి మించి సరుకు రవాణా చేయటం వల్ల ట్రక్కులో మంటలు చెలరేగాయని పోలీసులు పేర్కొన్నారు. సరకు రవాణా. ట్రక్కును లాగుతున్న వాహనం ఘటనా స్థలంలో లేదు. దీంతో డ్రైవర్ పరారయ్యి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. రాష్ట్ర రాజధాని సియుడాడ్ విక్టోరియా సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
Read Also: Kamareddy : సహజీవనం చేస్తూనే రూ.6వేల కోసం గొడవ.. మహిళ ఇంటికి నిప్పు
మృతులందరి గుర్తింపును అధికారులు ఇంకా నిర్ధారించలేదు. అందువల్ల ట్రక్కు డ్రైవర్ కూడా ప్రమాదంలో మరణించాడా లేదా అతను పారిపోయాడా అనేది ఖచ్చితంగా తెలియలేదు. అయితే అధికారులు మరణించిన వారి ఐడీలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది మెక్సికన్లే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.