Mexico Bus plunges off cliff: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ మెక్సికోలో బస్సు కొండపై నుండి పడిపోవడంతో కనీసం 18 మంది మరణించారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. 33 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెక్సికోలోని నయారిట్ రాష్ట్రంలోని కంపోస్టెలాలో గుయాబిటోస్‌కు వెళ్తున్న బస్సు కేంద్రమైన ప్యూర్టో వల్లర్టాను కలిపే హైవేపై శనివారం రాత్రి వాహనం 15 మీటర్లు (49.21 అడుగులు) లోయలో పడిపోయిందని అధికారులు వెల్లడించారు.
Read Also: Extramarital Affair: వివాహేతర సంబంధం.. పక్కా స్కెచ్ వేసి భార్య రివేంజ్
హైవేలోని గ్రామీణ ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగిందని నయారిత్‌లోని స్థానికులు తెలిపారు. పర్యాటకులు గుయాబిటోస్ నుండి ఉత్తర నగరమైన ప్యూర్టో వల్లర్టాకు తిరిగి వస్తున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. మెక్సికోలో ఇదివరకు ఇలాంటి ప్రమాదాలు చాలానే చోటుచేసుకున్నాయి. అద్దె బస్సుల నిర్వహణ సరిగా లేకపోవడం, చెడు వాతావరణం లేదా రహదారి పరిస్థితులు లేదా అతివేగం కారణంగా ఇటువంటి ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయి.